మాస్ లో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ 'సరిలేరు నీకెవ్వరు' మైండ్ బ్లాక్ సాంగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాస్ లో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ 'సరిలేరు నీకెవ్వరు' మైండ్ బ్లాక్ సాంగ్

సూపర్ స్టార్ మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ తో సెన్సేషన్ సృష్టించి, ఫస్ట్ సాంగ్ 'మైండ్ బ్లాక్' తో సందడి చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్ విడుదలైనప్పటి నుండే మాస్ ని విశేషంగా ఆకట్టుకుని అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆటోలు, టీ షాపులు, పార్టీలు... అంతటా మైండ్ బ్లాక్ మాస్ బీట్ మారుమోగుతోంది. ఫస్ట్ సాంగ్ కి వచ్చిన ఈ అద్భుత స్పందన కి సూపర్ స్టార్ అభిమానులు సూపర్ హ్యాపీగా ఉన్నారు.
మాస్ లో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ 'సరిలేరు నీకెవ్వరు' మైండ్ బ్లాక్ సాంగ్

'మైండ్ బ్లాక్' సాంగ్ ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ సాధించి టాప్ లో దూసుకుళ్తోంది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్ లు కూడా అనౌన్స్ చేశారు. ఈ కాంటెస్ట్ లతో థ్రిల్ అయిన ఆడియన్స్ 'మైండ్ బ్లాక్' సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత విడుదల కానున్న సెకండ్ సాంగ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 11, 2019 న విడుదల కానుంది.