టీడీపీ అధ్యక్ష రేసులో అచ్చెన్న - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీ అధ్యక్ష రేసులో అచ్చెన్న

శ్రీకాకుళం, డిసెంబర్ 14, (way2newstv.com)
సిక్కోలు రాజకీయాలు తీసుకుంటే ఏ పార్టీ చూసినా గ్రూపులు తప్పవు. ఇక్కడ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు గ్రూపులకు అతీతంకావు. అయితే అధికారంలో ఉన్న పార్టీలో గ్రూపులున్నాయంటే కొంత అర్థముంది. కానీ దారుణంగా ఓటమి పాలయిన తెలుగుదేశం పార్టీలో సయతం ఇంకా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిక్కోలు అనగానే టీడీపీలో ముందుగా గుర్తుకొచ్చేది కింజారపు కుటుంబమే. ఇది కాదనలేని వాస్తవం.సిక్కోలు తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు మధ్య దీర్ఘకాలం నుంచి విభేదాలున్నాయి. కళా వెంకట్రావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగించడం కూడా అచ్చెన్నాయుడుకు ఇష్టంలేదు. 
టీడీపీ అధ్యక్ష రేసులో అచ్చెన్న

అధికారంలో ఉంటే ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తన ఆధిపత్యమే కోరుకునే నేత అచ్చెన్నాయుడు. కళా వెంకట్రావు పెత్తనాన్ని ఎట్టిపరిస్థితుల్లో అచ్చెన్న అంగీకరించరు. ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పటికీ ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోని పరిస్థితి.ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం అచ్చెన్నాయుడు కుటుంబమే సిక్కోలులో సత్తా చాటింది. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారు. ఇచ్ఛాపురం నుంచి అశోక్ గెలుపొందారు. అశోక్ సయితం అచ్చెన్నాయుడు గ్రూపు. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో అచ్చెన్నాయుడు సిక్కోలు పార్టీపై దృష్టి పెట్టారు. విపక్షంలో ఉన్నా తన ఆధిపత్యం చెక్కు చెదరకూడదని భావిస్తున్న అచ్చెన్నాయుడు కళా వెంకట్రావు పదవికి ఎసరు పెట్టారని తెలుస్తోంది.కళా వెంకట్రావును టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అచ్చెన్న వర్గం డిమాండ్ చేస్తుంది. రాజమండ్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ కూడా ఎర్రన్నాయుడు కుమార్తె కావడంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం అచ్చెన్నాయుడు చేస్తున్నారు. బీసీలకు తిరిగి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చంద్రబాబు అప్పగించనున్నారు. అందుకే అచ్చెన్నాయుడు తన అన్న కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పార్టీ అధ్యక్ష  పదవి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయాన్ని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. టీడీపీకి నమ్మకమైన కుటుంబంగా పేరున్న కింజారపు కుటుంబానికి చంద్రబాబు పదవి ఇస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే అచ్చెన్నాయుడు మాత్రం కళా వెంకట్రావును తొలగించేంత వరకూ నిద్రపోనని అంటున్నారు. మొత్తం మీద ఓడిపోయినా టీడీపీలో వర్గ విభేదాలు తగ్గలేదనడానికి సిక్కోలు రాజకీయాలే ఉదాహరణ