కాకినాడ, డిసెంబర్ 28, (way2newstv.com)
మానవ నాగరకత ప్రపంచంలో ఎక్కడ పుట్టిందన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నా.... అభివృద్ధి విషయంలో భేదాభిప్రాయాలు లేవు. పురాతన నాగరికత నదీ తీరాల్లో మొదలయ్యి... సముద్ర తీరాల్లో వీరాజిల్లిందన్నది అందరూ అంగీకరించే చారిత్రక వాస్తవం. ఆదిమానవుడి నుండి నేటి ఆధునిక మనిషి వరకు ప్రతి విషయం జలంతోనే ముడిపడి ఉంది. యూరఫ్, పశ్చిమ దేశాల నావికాయాత్రికులు తూర్పుతీరాలకు ప్రయాణించి ఎన్నో దేశాలను కనుగొని... వ్యాపార సంబంధాలను మెరుగుపర్చారు. శతాబ్దాల నాటి కాలువకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.జలయానాలు ప్రపంచ గతిని మార్చాయి. చరిత్రను కొత్తపుంతలు తోక్కించాయి.
అటకెక్కిన బకింగ్ హమ్ కెనాల్
అందుకే తొలి నాగరికతల విలీనం జల మార్గాలతోనే జరిగిందన్నది కాదనలేని నిజం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి చెన్నై వరకు మన రాష్ట్రంలోనూ జలరవాణా బాగా కొనసాగింది. 19వ శతాబ్దంలో బకింగ్ హామ్ కెనాల్ కు శ్రీకారం చుట్టగా...20 వ శతాబ్దానికి ముందు చూపులేని పాలకుల కారణంగా కనుమరుగయ్యింది. గుడ్డిలో మెల్లలా మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఈ జల రవాణా మార్గాన్ని పునరుద్దరించాలని, విస్తరించాలని తలంచింది. ప్రస్తుత తరుణంలో దాని పునరుధ్దరణ సాధ్యమేనాఅన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దేశాన్ని దోచుకున్నా బ్రిటిష్ వారు కొన్ని చారిత్రక మేళ్లు సైతం చేశారు. ఓడరేవులు, రైల్యేలు, బ్రిడ్జిలు, నదులపై ఆనకట్టలు, అంతర్గత జలరవాణా వ్యవస్థలు తెల్లదోరలు ఇచ్చిన వరాలే. ఏ సాంకేతికత పరిజ్ఞానం లేని రోజుల్లో బ్రిటిష్ వారు చేసిన కొన్ని మహత్తర ప్రాజెక్టులు. 65 ఏళ్ల కాలంలో అలాంటి నిర్మించకపోగా... నిర్వీర్యం అవుతున్నాయి. కాలగర్బంలో కలిసిపోయిన దానిలో ఈ బకింగ్ హోమ్ కెనాల్ ఒకటి. మురుగు నీరు సముద్రంలోకి పంపడం, మరికొన్ని నదీ పయనించేలా.... గొప్ప అంతర్గత జల రవాణా వ్యవస్థే "బకింగ్ హామ్ జలరవాణా మార్గం." మద్రాస్ నుండి కాకినాడ వరకూ సముద్రానికి సమాంతరంగా, ప్రజల అవసరాలకు దగ్గరగా నిర్మించిన రవాణా సౌకర్యం. దక్షిణ భారత దేశంలో వచ్చిన తీవ్ర కరువు కాటకాలను ఎదుర్కొనడానికి ఎంతో ఉపయోగపడింది జలమార్గం. మద్రాస్ నుండి నేటి ప్రకాశం జిల్లా పెదగంజాం వరకూ కేవలం ఆయా ప్రాంతాల్లో మురుగునీరు, వరద నీరును సముద్రానికి చేర్చేందుకు నిర్మించబడింది ఈ కాలువ. సముద్రపు ఆటుపోట్ల ఉప్పునీళ్లు, మురుగునీళ్లు తప్పా మంచినీటి ఎరుగని కాలువ. దీనికి అనుసంధానంగా.... అక్కడక్కడా టెర్మినల్స్, నీటి రెగ్యులేటర్లు నిర్మించి.... అద్భుతమైన జల రవాణా మార్గంగా తీర్చి దిద్దారు బ్రిటిష్ వారు. బకింగ్ హామ్ అనే వైస్రాయ్ హయాంలో 1806 లో ఇది నిర్మితమవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. తరవాతి కాలంలో క్రిష్ణానదిపై బ్యారేజ్, గోదావరిపై ధవళేశ్వరం ఆనకట్ట కట్టడంతో.... ఏలూరు మీదుగా రాజమండ్రి- కాకినాడ లకు పొడిగించారు బకింగ్ హామ్ కెనాల్ కాటన్ నిర్మించిన నీటి పారుదల వ్యవస్థ, జల రవాణాను పరిశీలిస్తే అబ్బుర పరుస్తాయి. బీడు భూములకు నీటి పారుదలతో పాటు ఒక చక్కని ట్రాన్స్ పోర్టు సిస్టంను అభివృద్ది పరిచారు. నేటి పాలకులు లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టులోనూ ఈ సదుపాయాలు కనిపించవు. రోడ్డు, రైలు మార్గం కంటే జల మార్గం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు... పొందే మార్గం ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. బకింగ్ హామ్ కాలువ ఏర్పడిన తొలినాళ్లలో ఆయిల్ ఇంజన్లు లేవు. ప్రవాహానికి దిగువకు వెళుతుంటే... తెరచాప, పొడవాటి వెదురు ఉపయోగించి పడవ ఒడ్డుకు తాకకుండా తాళ్లతో లాక్కుంటూ నడిచేవారు. ఏలూరు, విజయవాడ ప్రకాశం బ్యేరేజ్ మీదుగా కొమ్మమూరు కాల్వ ద్యారా పెదగంజాం చేరుకునేవారు. అక్కడి నుండి మద్రాస్ సెంట్రల్ స్టేషన్, మరక్కానమ్ వరకూ ఈ కాలువ విస్తరించి ఉంది. అప్పటి నిర్మాణాలు, గేట్లు, తూములు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చిన్నప్పుడు చూసిన జలరవాణా తిరిగి ప్రారంభమవుతుందంటే ...చాలా మంది సంబరపడుతున్నారు. పర్యావరణరహితంగా పల్లెలు, పట్టణాలు, నగరాలు ఎంతో అభివృద్ది చెందుతాయని చెబుతున్నారు.నెల్లూరు, ప్రకాశం, గుంటురు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల ప్రజల జీవన విధానం మొత్తం ఈ బకింగ్ హామ్ కాలువతోనే ముడిపడి ఉండేది. రైల్యేలు, మోటారు వాహనాలు అభివృద్ది చెందడంతో దీని ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అప్పట్లో ఇంధన రేట్లు చవగ్గా ఉండడం, వేగంగా రవాణా కావటంతో రైల్యే, రోడ్డు మార్గాలు డెవలప్ అయ్యాయి. 1965 లో వచ్చిన దివిసీమ ఉప్పెనతో జల రవాణా మార్గం దెబ్బతింది.1976 లో వచ్చిన మరో తుఫాన్ తో రవాణా నిలిచిపోయింది. మన దేశంలోని బ్రిటిష్ వారు అభివృద్దిచేసిన మూడు అతి పెద్ద అంతర్గత జలరవాణా మార్గాల్లో ఇది ఒకటి. మరల కేంద్రం దృష్టి సారించినప్పటికీ చిత్తశుద్ధితో పునరుద్దరిస్తే.... బాగుంటుందన్నారు స్థానికులు. బకింగ్ హామ్ కాలువ పునరుద్దణ జరిగితే కోస్తా తీరంలో పర్యాటకం మరింత ఊపందుకుంటుంది. కాకినాడ తీరంలో ఉన్న మడ అడవులు, కోనసీమ అందాలు, వంపులు తిరిగిన గోదావరి పాయలు ప్రకృతి వరప్రసాదంగా నిలిచిన పాపి కోండల బోట్ షికార్ మరింత విసృతమవుతుంది. అయితే కాలువ పునరుద్దరణకు అనేక అడ్డంకులు మాత్రం ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో జలమార్గం కనుమరుగుకాగా మరికొన్నిచోట్ల అక్రమణాలకు గురయింది. వీటిని తొలగించాలంటే ఖర్చుతో కూడుకున్న పనితోపాటు ఆక్రమణదారుల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.కొత్త ప్రతిపాదిత జాతీయ అంతర్గత జలరవాణా మార్గం మూడు దశల్లో 1028 కిలోమీటర్లు పొడిగించాలని కేంద్రం ఆలోచిస్తుంది. ప్రస్తుతం రెండు వేల కోట్ల పైగా నిధులు దీనికి అవసరం. నేరుగా నిధులు కేటాయించే కంటే ..ప్రయివేటు భాగస్వామ్యంలో పిపిపి పద్దతిలో చేపట్టాలని యోచిస్తుంది ప్రభుత్వం. కానీ మురుగునీరు సముద్రంలోకి పోవాల్సిన చోట కాలువ కుచించుకుపోయింది. మిగిలిన చోట ఆక్రమణలకు గురి అయింది. చెన్నై నగరంలో యాభై కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మిచుకోవాల్సిన పరిస్థితి. ది చెన్నై మాస్ రాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టం నిర్మాణాలు బకింగ్ హామ్ కాలువలోనే ఉన్నాయి. వీటిని ఇప్పుడు మార్చడం సాధ్యం కానిపనిగా విశ్లేషకులు భావిస్తున్నారు