గుంటూరు.డిసెంబర్ 14 (way2newstv.com)
;ఆయేషా మీరా హంతకులు ఎవరో వైసిపి ఎమ్మెల్యే రోజాకు తెలుసునని ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగమ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు.నిజమైన నిందితులు ఎవరో తెలిసి కూడా రోజా చెప్పడం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
ఆయేషా హంతకులు ఎవరో రోజాకు తెలుసు: ఆయేషా షంషాద్ బేగమ్
తన కుమార్తెను హత్య చేసినవారిని శిక్షించాలని తాను పన్నెండేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నానని ఆమె తెలిపారు. ఇప్పుడు ఏపి సిఎం జగన్ దిశ చట్టం తీసుకువచ్చారని, ఆయేషా కేసును కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలని ఆమె డిమాండ్ చేశారు.