పాలిష్ చేసి... మాజీ ఎంపీకి వార్నింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాలిష్ చేసి... మాజీ ఎంపీకి వార్నింగ్

అనంతపురం, డిసెంబర్ 20, (way2newstv.com)
వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులు బూట్లు పాలీష్ చేశారు. ఎంపీ పోలీసుల బూట్లు పాలిష్ చేయడమేంటని అనుకుంటున్నారా.. నిజమే.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులుపై చేసిన వ్యాఖ్యలకు ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. బూట్లు తుడిచిన ఎంపీ గోరంట్ల మాధవ్.. అనంతరం ఆ బూట్లను ముద్దాడారు. ఇలా చేసినందుకు తాను గర్వపడుతున్నాను అన్నారు.. జేసీ పోలీసులపై చేసిన వ్యాఖ్యల్ని తప్పుట్టారు.దేశాన్ని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల పరువును పోగుడుతూ జేసీ దివాకర్‌రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాధవ్ మండిపడ్డారు. అమ్మ జన్మనిస్తే.. రక్షణగా ఉండే పోలీసులు పునర్జన్మ ఇస్తారని దివాకర్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. 
 పాలిష్ చేసి... మాజీ ఎంపీకి వార్నింగ్

ఆయనకు రక్షణగా నిలిచేది.. భద్రత ఇచ్చేది పోలీసులని గమనించాలన్నారు. పోలీసులు అంటే ఏ మాట్లాడినా పట్టించుకోరనుకుంటున్నారని.. పోలీసుల నుంచి వచ్చిన వాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని గుర్తు పెట్టుకోవాలన్నారు.. తానూ అలాగే వచ్చి ఎంపీ అయ్యానని.. తాను ట్రైల్ చూపిస్తేనే గెలిచానన్నారు.ఇప్పటికే జేసీ దివాకర్‌రెడ్డి కథ ముగిసిందని.. ఎన్నికల్లో ఆయన కొడుకు పని కూడా ముగిసిపోయిందన్నారు. అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని.. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జేసీ తన పద్దతి మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు మాధవ్.ఇక జేసీ వ్యాఖ్యలు చేస్తుంటే.. చంద్రబాబు ఎలా నవ్వుతారని ప్రశ్నించారు మాధవ్. చంద్రబాబుకు ఎలా నవ్వు వచ్చిందని.. సీనియర్ పొలిటీషియన్, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏంటన్నారు. చంద్రబాబుకు కూడా ఎస్పీజీ వాళ్లు రక్షణ కల్పిస్తున్నారని.. పోలీసుల్ని ఇలా మాట్లాడితే చంద్రబాబు ఎందుకు స్పందించలేదన్నారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కనీసం అడ్డు చెప్పలేదన్నారు.