దేశానికి ఆదర్శంగా కాసులపల్లి ::రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యారాజన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేశానికి ఆదర్శంగా కాసులపల్లి ::రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యారాజన్

ప్రజాక్రాంతి   డిసెంబర్ 11 (way2newstv.com)
స్వచ్చత అంశంలో  కాసులపల్లి గ్రామం దేశానికి ఆదర్శంగా ఉందని  రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యా రాజన్ అన్నారు.  బుధవారం  గవర్నర్  బసంత్ నగర్ లో స్వశక్తి  మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన బట్ట సంచుల తయారీ  యూనిట్ ను, శాంతినగర్ లో ఏర్పాటు చేసిన  శానిటరీ న్యాపకిన్ తయారీ కేంద్రాన్ని  పరిశీలించారు. అనంతరం  పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో పర్యటించిన గవర్నర్ గ్రామంలో  అమలవుతున్న  స్వచ్చ కార్యక్రమాలను పరిశీలించారు.  పంచసూత్రాలు గ్రామంలో  అమలు చేస్తున్న తీరును గవర్నర్ కు కలెక్టర్ వివరించారు.   పారిశుద్ద్య నిర్వహణలో కాసులపల్లి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచిందని,  గ్రామంలో  మురికి కాల్వలను పూర్తి స్థాయిలో నిర్మూలించారని,  ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి వినియోగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నారని  గవర్నర్ ప్రశంసించారు.  
దేశానికి ఆదర్శంగా కాసులపల్లి  ::రాష్ట్ర  గవర్నర్  తమిళి సై సౌందర్యారాజన్

స్వచ్చత నుండి స్వస్థత సాధన దిశగా  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రారంభించిన పంచసూత్రాల కార్యక్రమాన్ని కాసులపల్లి గ్రామంలో పకడ్భందిగా పూర్తి  స్థాయిలో అమలు చెస్తున్నారని, ప్రతి ఇంటిలో మొక్కల పెంపకం జరుగుతందని,  చెత్త నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని , స్పూర్తి కొనసాగించాలని గవర్నర్ కోరారు.  జిల్లాలో స్వచ్చత  మెరుగుపర్చడంలో  అధికారులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తు   కలెక్టర్ రుపొందించి అమలు చేస్తున్న పంచసూత్రాల కార్యక్రమం మంచి ఫలితాలనందించిందని, దేశంలో  పెద్దపల్లి జిల్లా స్వచ్చత అంశంలో ప్రథమ స్థానంలో ఉండి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా  కలెక్టర్  అవార్డు స్వికరించడం అభినందనీయమని గవర్నర్   కలెక్టర్ ను ప్రశంసించారు.కాసులపల్లి గ్రామంలో ప్రజలను ఏకం చేస్తు స్వచ్చత అంశాలను నూరు శాతం పాటించడంలో కృషి చేసిన  గ్రామ సర్పంచ్ దాసరి పద్మ ను గవర్నర్ అభినందించారు. కాసులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించిన గవర్నర్ మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. గ్రామంలో  పండ్ల మొక్కల పెంపకం  బాగుందని , ప్రతి ఇంటికి స్థానిక ఎమ్మెల్యే  పండ్ల మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమని  పర్యావరణ సంరక్షణకు అందరు తమ వంతు పాత్ర పోషించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.కళాకారుల  ఘనస్వాగతంస్వచ్చత అంశాలను పరిశీలించేందుకు కాసులపల్లి గ్రామానికి వచ్చిన  రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్యారాజన్ కు  గ్రామస్థులు, కళాకారులు ఘన స్వాగతం పలికారు.   తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చిహ్నలైన బోనాలు, బతుకమ్మలు,  డప్పు చప్పుడ్లతో  , వివిధ కళారుపాలను ప్రదర్శిస్తు  గవర్నర్ ను స్వాగతించారు.  కళాకారుల కళాప్రదర్శనలు అందరిని అలరించాయి.గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మెహన్,  పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ,  పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిమనోహర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి,  జిల్లా ఇంచార్జి డిఆర్వో  కె.నరసింహమూర్తి, పెద్దపల్లి ఆర్డిఒ ఉపెందర్ రెడ్డి,  గ్రామ సర్పంచ్ దాసరి పద్మ, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు,  సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు   ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.