మహిళా రక్షణ కోసం యాప్ రూపొందించాం
హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం
అసెంబ్లీలో మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ
మహిళల్లో అవగాహన విశ్వాసం నింపేదంఉకు ప్యత్నిస్తున్నాం
- శాసనసభలో హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత
అమరావతి డిసెంబర్ 09, (way2newstv.com):
ఏపీ ప్రభుత్వం మహిళ రక్షణ, భద్రతను కట్టుదిట్టం చేయటానికి అనేక ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత సభలో తెలిపారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు, కిశోర బాలికలనుచైతన్యపరిచి సాధికారపరచటానికై అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారామె. ఏపీ పోలీస్, శిశుసంక్షేమ శాఖలు మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఈ అంశాలు సాధించటానికి అనేక చొరవలతో ముందుకు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆమె సభలో వివరించారు.ప్రభుత్వం 11వేల గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, 3వేల వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శిలను మొత్తం 14వేల పదవులను నోటిఫై చేయటం జరిగిందన్నారు.
మహిళా రక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
7.12.19 నాటికి ఈ ఉద్యోగాల్లో 9,574 మంది చేరారని తెలిపారు. 2,271 మందితో కూడిన మొదటి బ్యాచ్ను 9.12.2019 నుండి 23.12.2019 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శిక్షణా కేంద్రాల్లో శిక్షణకు పంపటం జరుగుతుందని వివరించారు. కార్యదర్శులు శిక్షణ పొందేవరకు ఈ శిక్షణకొనసాగుతుందన్నారు. గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులను సచివాలయాల్లో నియమించటం జరిగిందన్నారు. దీనివల్ల పోలీసు సేవలు మెరుగుపడటం జరుగుతుందని సుచరిత అన్నారు. శాంతిభద్రతల అంశాలు, కుల సంఘర్షణలు, పౌర వివాదాలు, వ్యవసాయ సంబంధ సమస్యలు, నీటి పంపక అంశాలు మొదలగు వాటితో ఎస్హెచ్ఓలకు వీరు ఉపయోగకరంగా ఉంటారన్నారు. ప్రధాన శాంతిభద్రతల సమస్యలను నివారించటంలో ఎస్హెచ్ఓకు సహాయపడటం జరుగుతుందని హోంమంత్రి సుచరిత వివరించారు. మహిళా ముఖ్య కమిటీకి వీరు కన్వీనర్గా ఉండటం జరుగుతుంది. గ్రామ పోలీసు అధికారులతో కలిసి పాఠశాల, కళాశాలలను సందర్శించి రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించటం జరుగుతుంది. సామాజిక దురలవాట్లపై ఎస్హెచ్ఓకు సమాచారాన్ని సమకూరుస్తారు. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై రైతులకు కౌన్సిలింగ్లో వీళ్లు పాల్గొంటారు. గ్రామవాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎస్హెచ్ఓకు పంపటం జరుగుతుంది. దీంతోపాటు కేసుల దర్యాప్తులో నేరస్థలం రక్షించటం, తప్పిపోయిన కేసులు పర్యవేక్షించటం, బాల్యవివాహాలు నివారించటంలో ఎస్హెచ్ఓకు సహాయపడతారని సుచరిత వివరించారు. మద్యపాన వ్యసనం, మత్తుమందులు, లింగ వివక్షత మొదలగు విషయాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. కేంద్ర ఎస్డబ్ల్యు సమన్లు అందించటంలో స్థానిక పోలీసులకు వీరు సహాయపడతారన్నారు. అన్ని కేసుల సాధనలో వీరు సాక్ష్యులుగా ఉంటారని, స్పందన, సురక్ష యాప్లో పేర్కొన్న 89 సేవలు సమకూర్చటంలో పీఎస్, పౌరుల మధ్య వీరు వారధులుగా పనిచేస్తారని తెలిపారు.అదేవిధంగా మహిళా మిత్ర చొరవను ఏపీ పోలీస్ విభాగం చేపట్టం జరిగిందన్నారు. సమాజం ఆలోచనలు మారుస్తూ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రత్యేకించి యువత, బాలలకు అవగాహన కల్పించి మహిళలపై నేరాలు తగ్గిటంచటమే లక్ష్యంగా ఉందన్నారు. సీఐడీ, మహిళా రక్షణ విభాగపు అదనపు ఎస్పీ రాష్ట్ర నోడల్ అధికారిగా ఉండగా, డిప్యూటీ ఎస్పీ, మహిళా సీఐ, మహిళా డిప్యూటీ ఎస్పీ జిల్లా నోడల్ అధికారిగా ఉండటం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు పోలీస్ అధికారులను మహిళా మిత్ర సమన్వయకర్తులుగా చేసి మహిళా మిత్ర ఉద్దేశాలు, లక్ష్యాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. మహిళా మిత్ర సమన్వయకర్తలు, మహిళలు, బాలల సమస్యలపై అవగాహన కలిగిన మహిళా వాలంటీర్లు, ప్రఖ్యాతి గాంచిన ఎన్జీఓలు, ఉపాధ్యాయులతో ప్రతి గ్రామం, వార్డు కోసం ఒక్కో కమిటీ కోసం ఏర్పాటు చేస్తారని సుచరిత వివరించారు. మహిళా మిత్ర గ్రామ/వార్డు కమిటీల్లో గ్రామ/వార్డు సంరక్షణ కార్యదర్శి కన్వీనర్గా చేర్చబడతారని తెలిపారు. ఈ కమిటీ విధులు, బాధ్యతలు ఏమిటి అంటే.. మహిళలు, బాలలకు సంబంధించిన అంశాలను గుర్తించటం. పోలీస్ స్టేషన్కు సత్వరమే నివేదించటమన్నారు. పోలీస్ సమన్వయకర్తతో పాటుగా కమిటీ సమావేశాలు నిర్వహించటం. స్థానిక ప్రజలకు చట్టాలు, నియమాలపై అవగాహన కల్పించటం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలల లైంగిక దుర్భాష గురించి పిల్లల్లో అవగాహన కల్పించటం, హెల్ప్ లైన్ గురించి అవగాహన, బాల్యవివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ, బెల్ట్ షాపులు, గేమింగ్, పని ప్రదేశాల్లో వేధింపులు గురించి సమాచారం ఇవ్వటం ఈ కమిటీ యొక్క బాధ్యత అని సుచరిత తెలిపారు.