పుట్టపర్తి, డిసెంబర్ 5(way2newstv.com)
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలోఒక రోజు పర్యటనలో భాగంగా గురువారం పుట్టపర్తి విమానాశ్రయం నందు ముఖ్యమంత్రికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు, గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి, గురువారం ఉదయం 10.52 నిమిషాలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శంకర్ నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు,
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు
డిఐజి, క్రాంతి రానా టాటా, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు, రత్నాకర్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మెహతా, కదిరి ఆర్డిఓ రామ సుబ్బయ్య, ఎస్ కె యూనివర్సిటీ విశ్వవిద్యాలయ ఉప కులపతి జయరాజ్, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు ప్రతినిధి, కే ఎన్ మూర్తి. మహిళా నాయకురాలు.M.K. రూప, స్థానిక నాయకులు సోమ శేఖర్ రెడ్డి , రాజశేఖర్ రెడ్డి, తాసిల్దార్ గోపాలకృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు, అనంతరం ప్రత్యేకహెలికాప్టర్ ద్వారా kiya పరిశ్రమలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఉదయం 11.05 నిమిషాలకు బయలుదేరి వెళ్లారు, ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు, మరియు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ, మరియు బిసిసంక్షేమ శాఖ మంత్రివర్యులు శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు.