రైతులు ,మహిళలకు గౌరవం దక్కేలా చేసింది శ్రీ కేసిఆర్ ప్రభుత్వమే : మంత్రి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులు ,మహిళలకు గౌరవం దక్కేలా చేసింది శ్రీ కేసిఆర్ ప్రభుత్వమే : మంత్రి

వేములవాడ డిసెంబర్ 5, (way2newstv.com)
ప్రభుత్వ పథకాల ద్వారా   తెలంగాణ ప్రాంతంలోని రైతులు ,మహిళలకు గౌరవం దక్కేలా చేసింది వ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. గురువారం వేములవాడ మహా లింగేశ్వర ఫంక్షన్ హాల్ లో బ్యాంక్ లింకేజి, స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాల కు రుణ మేళా కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వయం సహాయక సంఘ సభులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు .రైతులు, మహిళలు వృద్ధులు యువతకు గౌరవం దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి గుర్తు చేశారు.
రైతులు ,మహిళలకు గౌరవం దక్కేలా చేసింది శ్రీ కేసిఆర్ ప్రభుత్వమే : మంత్రి

గతంలో కరెంట్ వస్తే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్తగా మనం చూస్తున్నామన్నారు. ఒకప్పుడు కరెంటు కోసం కంటిమీద కునుకు లేకుండా ఎదురు చూసిన  రైతాంగం ప్రస్తుతం కరెంటు ఇక సరిపోయింది  అనే దాకా పరిస్థితి ని ప్రభుత్వం కల్పించిదన్నారు .  అంతేకాకుండా వరంగల్ జిల్లాలో సాగునీటికి నీరు సరిపోయింది ఇక చాలు అని రైతులు అంటున్నారంటే ప్రభుత్వ కృషి ఏపాటిదో అర్థం అవుతుందన్నారు .వ్యక్తిగతంగా మహిళా సభ్యులకు ఇచ్చే స్త్రీనిధి రుణాలను రూ 50 వేల నుంచి మూడు లక్షల వరకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి దేనని మంత్రి అన్నారు.  లోన్ పొందిన స్వయం సహాయక సభ్యురాలు ఏదేని కారణంతో చనిపోతే ఆ మొత్తం రుణాన్ని మాఫీ చేసేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందించిదన్నారు. ఒకవేళ కొంతమేర రుణాలను కట్టి మధ్యలో తనువు చాలించిన అప్పటివరకు కట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది అన్నారు .ఈ ప్రాంత శాసనసభ్యులుగా  చెన్నమనేని రాజేశ్వరరావు మెట్ట ప్రాంతానికి గోదావరి నుంచి సాగర్ జలాలు తెచ్చేందుకు ఎంతగానో కృషి చేశారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్ట ప్రాంతానికి సాగునీటి కోసం  అప్పటి ముఖ్యమంత్రులు వద్దకు తగిన ప్రతిపాదనలతో వెళ్లి సాగునీటి సౌకర్యం కల్పించాలి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారన్నారు .ఎంతగా విజ్ఞప్తి చేసిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి అప్రకటిత తిరస్కారం ఎదురైంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాగునీటి రంగం అధిక ప్రాధాన్యతనిచ్చి గోదావరి జలాలను ఎత్తిపోతల పథకాల ద్వారా మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు.  ప్రజలు  గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులను పోల్చి చూసి ప్రజలు ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి సూచించారు. అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న కొన్ని  సమస్యలు, సవాళ్లు ఇప్పటికి  మన ముందు ఉన్నాయని మంత్రి తెలిపారు .వీటన్నింటిని ఒకేసారి పరిష్కరించాలంటే ప్రభుత్వాలకే కాదు  ఆ దేవుడికి సైతం సాధ్యం కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని  మంత్రి అన్నారు . ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం సమస్యల  పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దండి : ప్రజా ప్రతినిధులకు మంత్రి  సూచనజిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులపై ఉందని మంత్రి పేర్కొన్నారు. గతంలో గ్రామ పంచాయతీలకు విధులు తప్ప నిధులు ఉండని విషయాన్ని మనం చూశామన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం  ప్రతి నెల 339 కోట్ల రూపాయలను విడుదల చేస్తుందని అన్నారు.అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా 30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసిన ఘనత తెలంగాణ దక్కుతుందన్నారు. 30 రోజుల ప్రణాళిక లో ఉత్తమ పనితీరు కనబరిచిన కొత్త గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ కార్యాలయం భవనాలు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.ప్రణాళిక స్ఫూర్తితో నిరంతరం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచులకు విజ్ఞప్తి చేశారు . మన హయంలో స్మశాన వాటికో , డంప్ యార్దో నిర్మించామన్న ఆత్మ సంతృప్తి ఉండాలన్నారు . అపకీర్తి మూటకట్టు కోకుండా ఉండాలన్నారు . గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే క్రమంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ద్యం నిర్వహణకు ఇస్తున్న ట్రాక్టర్లను నిర్వాణ ఖర్చులను కొంతమేర ఉపాధి హామీ నుండే పొందేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. తాను మళ్లీ ఆరు నెలల తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా కు వస్తానని అప్పటికల్లా ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రూపులకు విరివిగా రుణాలు ఇస్తారని మంత్రి తెలిపారు