విజయనగరం, డిసెంబర్ 24 (way2newstv.com)
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడిపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు సంచలనం రేపింది. తమ భూమిని కబ్జా చేశారంటూ జాయింట్ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. మంత్రి సోదరుడు ఆదినారాయణ తమ భూమిని కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో అధికారుల్ని కోరారు.విజయనగరంలోని సత్యసాయినగర్ లే అవుట్‌లోని సర్వే నెంబరు 53-4, 53-5లలో కొంత స్థలాన్ని బాధితులైన కిరణ్, బి.రాజేష్, టీఏ సూర్యనారాయణ,
మంత్రి తమ్ముడే కబ్జా దారుడు
అశోక్‌కుమార్, వాసవి, పద్మావతి, గోవిందమ్మ కొనుగోలు చేశారట. తామంతా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారమని.. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థలాన్ని తీసుకున్నామని.. ఇప్పుడు ఆ స్థలాన్ని మంత్రి సోదరుడు ఆదినారాయణ కబ్జా చేశారని బాధితులుఆరోపించారు.లేఔట్‌లోని ప్లాట్స్‌ను కబ్జా చేశారని.. తమ లేఔట్‌కు అన్ని అనుమతులు ఉన్నా తమ స్థలాల చుట్టూ ప్రహరీ గోడ కట్టారని బాధితులు ఆరోపించారు. ఆదినారాయణపై చర్యలు తీసుకోవాలని.. తమ భూమిని రక్షించాలని కోరారు. మరి ఈ వివాదంపై మంత్రి సోదరుడు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
Tags:
Andrapradeshnews