సంగారెడ్డి డిసెంబర్ 14 (way2newstv.com)
ప్రభుత్వ పథకాలను, సబ్సిడీలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డిలో షెడ్యూల్ కూలాల సేవ సహకార అభివృద్ధి సంస్థ రుణమేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులను మంత్రి హరీష్‌రావు పంపిణీ చేశారు. అదేవిధంగా లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి: హరీష్‌రావు
మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.75 కోట్ల బ్యాంక్ లింకేజీ ఇస్తున్నట్లు తెలిపారు. మైక్రో క్రిడిట్ ప్లాన్ విధానం ద్వారా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. 300 మంది అబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో చెత్త సేకరణకు ఎనిమిది స్వచ్ఛ్ ఆటోలు ఇస్తున్నట్లు చెప్పారు.సంగారెడ్డిలో రూ.20 కోట్లతో ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను, సబ్సిడీలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందన్నారు. నిరుద్యోగ సమస్య లేకుండా వ్యాపారం చేసుకునే విధంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.