కొత్త ఏడాది... కొత్త రెవెన్యూ చట్టం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొత్త ఏడాది... కొత్త రెవెన్యూ చట్టం

హైద్రాబాద్, డిసెంబర్ 10, (way2newstv.com)
వచ్చే ఏడాది నుంచి రాష్టంలో కొత్త రెవెన్యూ చట్టం అమలు చేయాలని సిఎం కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా కంక్లూజివ్ టైటిల్ యా క్టును అమల్లోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ మేరకు భూ పరిపాలనలో సు దీర్ఘ అనుభవం ఉన్న నిపుణులు, న్యాయ నిపుణులతో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ నేతృత్వంలో ఇప్పటికే ప్రభుత్వం వర్క్‌షాపు నిర్వహించింది. మేథావులు, నిపుణులు, రెవెన్యూ శాఖలోని రిటైర్డ్ సీనియర్ అధికారులఅభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది.కొత్త చట్టంలో పొందుపరచాల్సిన అంశాలు, ఎన్ని చట్టాలుండాలి, ఇప్పుడున్న చట్టంలో పనికొచ్చేవి, ఉన్న శాఖను ప్రక్షాళన చేసేందుకు ఉన్న వనరులు, కొత్త చట్టం రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం తదితర వాటిపై ఈ వర్క్‌షాపులో చర్చించారు. 
కొత్త ఏడాది... కొత్త రెవెన్యూ చట్టం

ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి రాజీవ్‌శర్మ అందించినట్టుగా తెలుస్తోంది. వారంరోజుల్లోగా దీనిపై కెసిఆర్ సమీక్ష జరిపి త్వరలో దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించనున్నట్టుగా సమాచారం. అవినీతి రహిత భూ పరిపాలన దిశలో ఈ నూతన చట్టాన్ని రూపొందించారని, అందులో భాగంగానే నిపుణులకు ఈ బాధ్యతలను అప్పగించినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. కంక్లూజివ్ టైటిల్ యాక్ట్‌లో భాగంగా ఒక్కో స్థలానికి ఒక యూనిక్ కోడ్‌ను కేటాయించినట్టుగా తెలిసింది. ప్రతి మనిషికి ఆధార్ నెంబర్ ఉన్నట్టుగానే ప్రతి భూమికి, ప్లాట్‌కి యూనిక్ సంఖ్యతో కూడిన కోడ్ నెంబర్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. యజమాని పేరుతో ఉన్న యూనిక్ ఐడి ఆన్‌లైన్‌లో ఉంచడంతో క్షణాల్లో వారి వివరాలు తెలుసుకునేందుకు యాజమాన్య హక్కుల ధృవీకరణ సాధ్యమవుతుందని ఇది టైటిల్ యాక్ట్‌లో స్పష్టంగా ఉండడంతో ప్రభుత్వం యూనిక్ ఐడిపై దృష్టి సారించినట్టుగా తెలిసింది. భూముల క్రయ, విక్రయాల సమయంలో సదరు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కొంతమేర రుసుములను వసూలు చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఆయా భూములపై బీమా కూడా ప్రభుత్వమే చేయనుందని, దీనిని ఈ కొత్త చట్టంతోనే శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.కొత్త చట్టంలో భాగంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై ఇప్పటివరకు అధికారం ఉన్న సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల అధికారాలకు కోత పడనున్నట్టుగా తెలిసింది. భూములు, ఇండ్లు భవనాల సమాచారం వేర్వేరు శాఖల పరిధిలో నమోదై ఉంది. దీంతోపాటు రెవెన్యూ, సర్వే, భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖల దగ్గర వేర్వేరుగా సమాచారం ఉంటోంది. కొత్త చట్టం టైటిట్ యాక్ట్‌లో ఇదంతా ఒకే గొడుగు కిందకు వస్తుందని గతంలో కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. అందులో భాగంగానే మొదటగా భూములను రీ సర్వే చేసి యజమానులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.ఎపి రెవెన్యూ కోడ్‌లో సవరణలు చేస్తూనే మరోవైపు రెవెన్యూ శాఖలోని కొన్ని విభాగాల రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో యూఎల్సీ విభాగాన్ని రద్దు చేసిన ప్రభుత్వం ఆ తరువాత భూ సేకరణ ప్రత్యేక విభాగాన్ని రద్దు చేసి ఆయా బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు ప్ర భుత్వ అప్పగించింది. అప్పటివరకు భూ సేకరణ విభాగంలో ఉన్న నామమాత్రపు సిబ్బందిని రెవెన్యూ శాఖకు బదిలీ చేశా రు. దీని రద్దు తరువాత భూ సేకరణ బాధ్యతలు జాయింట్ కలెక్టర్ల పరిధిలోకి చేరాయి. తాజాగా సర్వే సెటిల్‌మెంట్ శాఖ రద్దుపై ప్రభుత్వం దృష్టి సారించింది.రికార్డ్ ఆఫ్ రైట్స్ విధానంలో మార్పులు, పహాణీలోని మరికొన్ని అక్కరలేనివి తొలగింపులతో పాటు చట్టంలో అనేక సంస్కరణలను తీసుకురావాలని అవి జాతీయస్థాయిలో ఆదవర్శవంతంగా ఉండేలా, ఒక్కో ఇంచు భూమికి అసలు యజమానులను నిర్ధారించి వాటిపై భూ హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ద్వారా హక్కులను మార్పు చేస్తున్న ప్రస్తుత విధానం పూర్తిగా మార్చివేసి రిజిస్ట్రేషన్‌కు ముందే సదరు ఆస్తులు, భూములపై అభ్యంతరాలను కోరాలని యోచిస్తోంది. ఆయా భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో, ఎవరు పొజిషన్‌లో ఉన్నారో ముందే ప్రభుత్వం పరిశీలించనుంది.రిజిస్ట్రేషన్ పూర్తయిన త రువాత ఆయా భూములు ఆక్రమణలకు గురైతే వాటిపై విచారణ చేసి నిజనిర్ధారణ చేసి అసలైన వ్యక్తులకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే పరిహారం ఇప్పించాలని కొత్త చట్టంలో పొ ందుపరిచినట్టుగా తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ నెల లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసుకొని దానిని ఆమోదించుకోవడంతో పాటు వచ్చే సంవత్సరంలో దీనిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.