ఆమంచికి దక్కని అవకాశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆమంచికి దక్కని అవకాశం

ఒంగోలు, డిసెంబర్ 31, (way2newstv.com)
మంచి కృష్ణమోహన్. అనధికారిక ఎమ్మెల్యే. చీరాల నియోజకవర్గం నుంచి ఓటమి పాలయిన ఆమంచి కృష్ణమోహన్ చీరాల తనదేనంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఇక్కడ టీడీపీ నుంచి కరణం బలరాం కృష్ణమూర్తి గెలుపొందారు. అయితే ఓటమి పాలయిన దగ్గర నుంచి ఆమంచి కృష్ణమోహన్ అధికారులతో అనధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.అనధికారిక ఆదేశాలు…..అయితే ఓటమి పాలయిన ఆమంచి కృష్ణమోహన్ తనకు తెలియకుండా నియోజకవర్గంలో పనులు జరగేందుకు వీలులేదని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. తాను చెప్పిన తర్వాతనే ఫైలు మూవ్ అవ్వాలని ఆయన ఆదేశాలను అధికారులు సయితం తూచ తప్పకుండా పాటిస్తున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సయితం ఆమంచి కృష‌్ణమోహన కు జై కొడుతుండంటంతో అధికారులు కిమ్మనడం లేదు.
ఆమంచికి దక్కని అవకాశం

సంక్షేమ పథకాల దగ్గర నుంచి అంతా ఆమంచి కృష్ణమోహన్ దే జరుగుతుండటంతో కరణం బలరాం ఇటీవల అధికారులపై ఫైరయ్యారట. తాను ఎమ్మెల్యేనని తనకు తెలియకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ కరణం అధికారులపై విరుచుకుపడటంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఆమంచి కృష్ణమోహన్ ఓటమి పాలయినా అధికార పార్టీ కావడంతో అధికారులు సయితం ఆమంచి కృష్ణమోహన్ కు ప్రయారిటీ ఇస్తున్నారు.కానీ అధికారిక కార్యక్రమాలలో ఆమంచి కృష్ణమోహన్ కు స్థానం కల్పించలేకపోతున్నారు. తన ప్రత్యర్థులు ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీతలు అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొంటుండటం ఆమంచి జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యక్రమానికి హాజరైనా ఆయన వేదికపైకి రావడం లేదు. ఇటీవల జరిగిన వైఎస్సార్ నేతన్నల నేస్తం కార్యక్రమంలో వేదికపైకి రావాలని మంత్రి బాలినేని ఆహ్వానించినా ఆమంచి రాలేదు. పైగా కరణం బలరాంకు వ్యతిరేకంగా ఆమంచి కృష్ణమోమన్ అనుచరులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికారిక కార్యక్రమాలు ఎప్పుడో ఒకసారి ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతా ఆమంచిదే కదా? అని ఆయన అనుచురులు సర్ది చెప్పుకుంటున్నారట.