కాకినాడ, డిసెంబర్ 10, (way2newstv.com)
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దీక్షలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పలు దీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలబడేందుకుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని ఆ పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2019, డిసెంబర్ 09వ తేదీన పార్టీ ఛైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
రేపు రైతుల కోసం జనసేనాని దీక్ష
కాకినాడలో డిసెంబర్ 12వ తేదీన ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభమౌతుందని తెలిపారు. దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అన్నపూర్ణలాంటి ఏపీ రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంలో ఉభయ గోదావరి జిల్లాల రైతులు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పవన్ క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, రైతులకు బాసటగా నిలించేందుకు ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. రైతాంగానికి బాసటా..నిలబడడం ప్రతొక్క జనసైనికుడిగా బాధ్యతగా భావించి కాకినాడ దీక్షకు తరలిరావాలని కోరుతున్నామన్నారు