పర్చూరులో జగన్ మార్క్ రాజకీయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పర్చూరులో జగన్ మార్క్ రాజకీయం

ఒంగోలు, డిసెంబర్ 10, (way2newstv.com)
ప్రకాశం జిల్లా ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ రాజ‌కీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక్కడ ఎన్నికలకు ముందు తాజాగా ఇప్పుడు వైసీపీ అనూహ్య రాజ‌కీయాలు చేసింది. ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర కు ఇక్కడ ఇంచార్జ్‌గా ఉన్న రావి రామ‌నాథంబాబు టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, అనూహ్యంగా ఎన్టీఆర్‌ పెద్దల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం, త‌న కుమారుడు చెంచురామ్ కు టికెట్ ఇప్పించుకోవ‌డం తెలిసిందే. అయితే, అమెరికా గ్రీన్ కార్డ్ స‌మ‌స్య నేప‌థ్యంలో చివ‌రి నిముషంలో నేరుగా ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు రంగంలోకి దిగి పోటీ చేయాల్సి వ‌చ్చింది.అయితే, టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబ‌శివ‌రావు బ‌లంగా ఉండ‌డంతో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు అనూహ్య ప‌రాజ‌యం మూ ట‌గ‌ట్టుకున్నారు. 
పర్చూరులో జగన్ మార్క్ రాజకీయం

ఇక‌, అప్పటి నుంచి కూడా వైసీపీతో ఆయ‌న అంటీ ముట్టన‌ట్టు వ్యవ‌హ‌రించారు. దీనికి తోడు ఆయ‌న స‌తీమ‌ణి, బీజేపీ నేత పురందేశ్వరి జ‌గ‌న్‌పైనా, ఆయ‌న ప్రభుత్వంపైనా విమ‌ర్శలు చేస్తున్నారు. దీనిని ఖండించ‌డంలోనూ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు చొర‌వ చూప‌డం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్ని క‌ల‌కు ముందు వ‌ర‌కు పార్టీకి అన్ని విధాలా అండ‌గా ఉన్న రావి రామ‌నాథంబాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో చేరిపోయి.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు ఓట‌మికి కృషి చేశారు. త‌న‌కు టికట్ ఇవ్వని నేప‌థ్యంలో ఆయ‌న త‌న క‌సి తీర్చుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి కేవ‌లం 1400 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు.అయితే, ఇప్పుడు వైసీపీ ఇక్కడ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావుని ప‌క్కన పెట్టి రావి రామ‌నాథంబాబును తిరిగి పార్టీలోకి తీసు కువ‌చ్చారు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావుని న‌మ్ముకుంటే ఎలాంటి ప్రయోజ‌నం లేద‌ని భావించిన వైసీపీ నాయ‌కులు రావికి పెద్దపీట వేశారు. భార్యభ‌ర్తలు ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉండ‌డంతో జ‌గ‌న్ అల్టిమేటం జారీ చేసేశారు. ఈ క్రమంలోనే అక్కడ పార్టీ బ‌లోపేతం అవ్వాలంటే రామ‌నాథం బాబే క‌రెక్ట్ అని జ‌గ‌న్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవ‌ల జ‌గ‌న్ ఒంగోలు ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు సైతం రామ‌నాథం బాబును త‌న ప‌క్కనే కూర్చోపెట్టుకుని ఆయ‌న‌కు ఎంత ప్రయార్టీ ఇస్తున్నానో చెప్పక‌నే చెప్పారు.ఇక తాజాగా ఆయ‌న‌కు జిల్లాలో మ‌రింత ప్రయార్టీ ఇచ్చేందుకు, ఆర్థిక వెసులుబాటు క‌ల్పించేందుకు కీల‌క‌మైన డీసీఎంఎస్ చైర్మన్ ప‌ద‌విని సైతం ఇచ్చారు. అంటే రావి ఆర్థికంగా ప‌రిపుష్టం కావ‌డానికి అవ‌కాశం ఉంది. ఆయ‌న తిరిగి పుంజుకునేందుకు, పార్టీని మ‌ళ్లీ ఇక్కడ బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న్ మంచి ఛాన్సే ఇచ్చారు. కొండ‌పిలో ఓడిపోయిన మాదాసు వెంక‌య్యకు డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వి ఇవ్వగా.. రామ‌నాథంకు డీసీఎంఎస్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న ప‌రిశీల‌కులు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక‌, ఈ టికెట్ రావికేన‌ని బ‌లంగా చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఇక‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావుని పూర్తిగా పార్టీ వ‌దిలేసింద‌ని, ఆయ‌న త‌న దారితాను చూసుకోవ‌చ్చని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.