గుంటూరు డిసెంబర్ 5 (way2newstv.com)
రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించటంపై వైకాపా ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందో చెప్పాలన్నారు. రాజధాని నిర్మాణంపై మంత్రులు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీకని ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.
రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేయాలి
రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 5న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.రాజధానిని అభివృద్ధి చేసుకునే చక్కటి అవకాశాన్ని జగన్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని అన్నారు. ఇప్పటికైనా రాజధాని నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే పరిపాలనలో విఫలమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఆరోపించారు. రూ.5వేలు జీతమిచ్చే గ్రామ వాలంటీర్లను సైతం ఉద్యోగులుగా చిత్రీకరించి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.