జిల్లాల్లో పెరుగుతున్న చలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జిల్లాల్లో పెరుగుతున్న చలి

నల్గొండ, డిసెంబర్ 31, (way2newstv.com)
నల్లగొండ జిల్లాలో చలి పెరుగుతోంది. సంక్రాంతి సమీపిస్తుండటంతో వణుకు ప్రారంభమవుతోంది. గడిచిన పది రోజుల్లో క్రమంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోటంతో చలి వాతావరణం పెరిగింది. ఉదయంపూట ఎండ ఉన్నప్పటికి సాయంత్రానికి చలిలో తేమశాతం పెరగటంతో చలి తీవ్రమవుతోంది. ప్రధానంగా కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తుంది. గడిచిన వారంరోజులపాటు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈనెల 22వ తేదీన 29.2డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా శనివారం 28.4డిగ్రీలకు పడిపోయింది. అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రత 15.4డిగ్రీల నుండి 15.2 డిగ్రీలకు పడిపోవటంతో గాలిలో తేమశాతం పెరిగి చలి తీవ్రమయింది. సాయంత్రం తర్వాత ఈ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పిల్లలతోపాటు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. 
జిల్లాల్లో పెరుగుతున్న చలి

తెల్లవారుజామున సైతం ఈ చలి ప్రభావం తగ్గకపోవటంతో దుప్పట్ల నుంచి బయటకురాలేని పరిస్ధితి.సంక్రాంతి సమీపిస్తున్న నేపధ్యంలో చలి ప్రభావం తీవ్రమవుతోంది. ఇప్పటివరకు జిల్లాలో ఈ తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికి ఇక ప్రారంభంకానుంది. సాధారణంగా చలికాలం అక్టోబర్‌ నుండి జనవరి వరకు ఉంటుంది. అయితే తొలి రెండు నెలల్లో పెద్దగా చలి ప్రభావం ఉండక పోయినప్పటికి డిసెంబర్‌ జనవరి నెలల్లో మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా జనవరిలో బాగా ఉండటంతో శరీరాన్ని కొరికేసినట్లుగా అనిపిస్తుంది. ఈ సమయంలో మధ్యాహ్నం సమయంలోనే గజ గజ వణకాల్సిన పరిస్ధితి నెలకొంటుంది.జిల్లావ్యాప్తంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలో క్షీణింపు పెరిగినా కొద్దిగాలిలో తేమశాతం పెరుగుతోంది. ఈ నేపధ్యంలో శరీరం చల్లగా మారి వణుకుదల మొదలవుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 30డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రత 15డిగ్రీల లోపు పడిపోతే చలి పెరుగుతది. అయితే జిల్లాలో ఈనెల 16వరకు గరిష్ట ఉష్ణోగ్రత 30డిగ్రీల పైన నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత సైతం 15డిగ్రీల పైనే నమోదు అయింది. ఆ తర్వాత క్రమంగా క్షీణించి గరిష్ట ఉష్ణోగ్రత శనివారం నాటికి 28.4డిగ్రీలు నమోదు కాగా కనిష్ట