తెరపైకి మరో స్వామి... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెరపైకి మరో స్వామి...

నెల్లూరు, డిసెంబర్ 24, (way2newstv.com)
కాషాయం ధరించి ధర్మ సూక్ష్మాలు చెప్పాలిసిన స్వాములు ఉద్యమాల్లోకి వచ్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వాముల హవా ఇటీవల కాలంలో బాగానే పెరిగిపోయింది. కర్ణాటక లో మఠాల నీడలో నడిచే రాజకీయాల తరహాలోనే ఏపీ లోపూ పొలిటికల్ స్క్రీన్స్ పై స్వాములు ఎంటర్ అయిపోతున్నారు. గతంలో విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపానందేంద్ర, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద వంటివారు సృష్ట్టించిన సందడి మరువకముందే ఇప్పుడు మరో స్వామిజీ రంగంలోకి దిగారు. ఆయనే కమలానంద స్వామిజీ. అమరావతి నుంచి సెక్రెటేరియట్, హై కోర్టు లు తరలిపోవడం ఖాయమన్న సంకేతాలపై అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు.కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు చేవ చచ్చి బతుకుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కమలానంద. 
తెరపైకి మరో స్వామి...

ఒకప్పటి ఉద్యమ స్ఫూర్తి వారిలో క్షిణించిందని రెచ్చగొట్టారు ఆయన. రాజధాని తరలిపోతుంటే మాకెందుకులే అని ఎలా మౌనంగా చూస్తారంటూ వారిపై విరుచుకుపడ్డారు. ఏమి జరిగినా చలించకుండా అచేతనంగా ఉంటే ఎలా అని ప్రశ్నలు సంధించి చర్చనీయాంశం అయ్యారు. అంతేకాదు భోగి పండగకు వచ్చి కోడి కూర తిన్నామా లేదా అన్నదే ముఖ్యంగా పెట్టుకున్నారు తప్ప మరేమి లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో గుంటూరు జిల్లా వాసులంటే భయపడతారని వారి తెలివితేటలూ అమోఘం గా వుంటాయని చెప్పుకుంటారని అవేమి ఇప్పుడు లేవంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు.ఉద్యమాలు, వివాదాల్లో దూరడం స్వామీజీలకు తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమి కాదు. అయితే రాజధాని ప్రాంత జిల్లాల వారిని ఈ రకంగా ఒక స్వామిజీ రెచ్చగొట్టడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అమరావతిలో రాజధాని వస్తుందని కమలానంద ద్వారా బడాబాబులు కొందరు భూములు బినామీలతో కొనిపించి ఉంటారని అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ కావడంతో స్వామిజీ నే స్వయంగా రంగంలోకి దిగి ఉంటారన్న ఆరోపణలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఏపీ వాసుల సుఖ సంతోషాలకు పూజలు చేయడం మాని ఒక ప్రాంతం తరపునే ఆయన వకాల్తా పుచ్చుకోవడం విచిత్రంగా ఉందని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా లో కూడా స్వాముల వింత పోకడలపై చర్చ పెద్ద ఎత్తునే సాగడం గమనార్హం.