సంచలనంగా మారిన గుర్తు తెలియని వ్యక్తి చేసిన ప్రకటన
హైదరాబాద్ జనవరి 27 (way2newstv.com)
ప్రముఖ నటుడు.. హిందూ అతి వాదానికి అడ్డుగా నిలుస్తూ.. తన వాదనను ప్రభావవంతంగా వినిపిస్తున్న ప్రకాశ్ రాజ్ ను తాము జనవరి 29న హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రకాశ్ రాజ్ తో పాటు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తో పాటు మరో పదమూడు మందిని హత్య చేయనున్నట్లుగా వారు వార్నింగ్ లేఖను సంధించారు.
నటుడు ప్రకాశ్ రాజ్ ను జనవరి 29న హత్య చేస్తాం
సంఘ్ పరివార్ ను విమర్శిస్తూ వచ్చిన నిజగుణానందస్వామికి వచ్చిన లేఖలో కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ.. వారందరిని ఈ నెల 29న హత్య చేయనున్నట్లు ప్రకటించారు. కన్నడ లో ఉన్న ఈ లేఖ లో.. ధర్మ ద్రోహులు.. దేశ ద్రోహులైన విమ్మల్ని ఈ నెల 29న హతమార్చేందుకు మహుర్తం పెట్టామని పేర్కొన్నారు. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రకాశ్ రాజ్ తో పాటు నిజగుణానంద స్వామితో పాటు మరికొందరుపేర్లను కూడా అందులో పేర్కొన్నారు. ఈ లేఖ సంచలనంగా మారటమే కాదు.. ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని పోలీసులు చెప్పారు. అయితే.. తమ మఠానికి అదనపు భద్రత అక్కర్లేదని స్వామి రిజెక్ట్ చేయటం గమనార్హం.