సోమవారం వరకు వేచి చూడండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోమవారం వరకు వేచి చూడండి

తాడేపల్లి జనవరి 25 (way2newstv.com)
బీజేపీ నేత సునీల్ డియోదర్ రాజదాని అంశంపై బీజేపీతో చర్చించలేదని అంటున్నారు. బీజేపీతో చర్చించామని మేము ఎప్పుడు చెప్పామా అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేదు. మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరాహైకోర్టు ను శాశ్వతంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారని అన్నారు. రాయలసీమ లో హైకోర్టు పెట్టడానికి బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేదా. మీరు ఇచ్చిన హామీని మేము అమలు చేస్తుంటే ఎందుకు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని అడిగారు. వికేంద్రీకరణకు అనుకూలమని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. 
సోమవారం వరకు వేచి చూడండి

అమరావతి నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది. రైతుల నుంచి భూముల బలవంతంగా చంద్రబాబు లాక్కున్నారని మేనిఫెస్టోలో బీజేపీ చెప్పింది. రాజధాని ప్రాంత భూములు తిరిగి వెనక్కి ఇస్తామని బీజేపీ చెప్పింది. బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసినా ఇంకా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని విప్లవాత్మక మైన సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి తెస్తున్నారు. వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక ఎకరా కొన్నట్లు ఆధారాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూపించాలి. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకేమిటని అన్నారు.  ప్రజా స్వామ్యానికి ఖునీ చేసింది చంద్రబాబు నాయుడే. ఫిరాయింపుల ను ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడే అని అన్నారు.మా పార్టీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కీలకమైన బిల్లు పై చర్చ జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గ్యాలరీలో కూర్చున్నారు. ఛైర్మన్ పై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు.చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని మాట్లాడడం హాస్యాస్పదమనిఅన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసిన ఎక్కడ మేము వెనకడు వేయము. 5 కోట్లుతో న్యాయ వాదిని పెట్టుకున్నారంటున్న గోల పెడుతున్న చంద్రబాబు రాజధాని కాన్సెలేంటెన్సీకు 845 కోట్లు ఖర్చు చేశాడు. మండలి రద్దు అవుతుందా లేదా అన్నది సోమవారం వరకు వేచి చూడండి. మండలి రద్దు చేయడం ఎవరి వల్ల కాదని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ మండలి రద్దు చేయలేదా. మండలి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినప్పుడు ఎలాంటి నిర్ణమైనా తీసుకుంటామని అన్నారు.