సగానికి తగ్గిన వైజాగ్ స్టీల్ అమ్మకాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సగానికి తగ్గిన వైజాగ్ స్టీల్ అమ్మకాలు

విశాఖపట్టణం, జనవరి 4, (way2newstv.com)
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పట్లో కోలుకుంటుందా? దేశ, విదేశాల్లో తన స్టీల్‌ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సరికొత్త ప్రణాళికలను తయారు చేసుకుంటుందా? 2018-2019లో సాధించిన ఫలితాల దిశగా 2019-2020లో ఏం చేయబోతుంది? అనే విషయాలపై స్టీల్‌ మేకర్లు, ప్లాంట్‌ కస్టమర్లు తాజాగా దృష్టిసారిస్తున్నారు. సగానికి సైతం కూడా చేరుకోలేక రూ.12 750 కోట్ల వద్దనే సేల్స్‌ నిలిచిపోయింది. మిగతా మూడు నెలలు స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత కీలకమైన సమయంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త అడుగులను వేస్తూ స్టీల్‌ అమ్మకాలకు సంబంధించిన వ్యూహాలను రచిస్తోంది. దీంట్లో భాగంగానే ఐదు నెలల క్రితం స్టీల్‌ ఫ్యాక్టరీలో అమ్ముడుపోకుండా ఉండిపోయిన ఏడు లక్షల టన్నుల స్టీల్‌ను రెండు నెలల క్రితం దీన్ని మూడు లక్షల టన్నులకు తగ్గించుకుంది.
సగానికి తగ్గిన వైజాగ్ స్టీల్ అమ్మకాలు

స్టీల్‌ తయారైనా కొనుగోలు చేసేవారు మార్కెట్‌లో లేకపోవడమనే సమస్య గడచిన కొద్ది నెలల పాటు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను వేధించింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారాకలో ఇసుక కొరత రావడంతో నిర్మాణరంగం పూర్తిగా పడిపోయింది. సెప్టెంబరు, అక్టోబర్‌, నవంబరు వరకూ పెద్ద ఎత్తున ఈ సంక్షోభం రాష్ట్రంలోని నిర్మాణరంగం ఎదుర్కొంది. పనులు ఆగిపోవడంతో ప్లాంట్‌కు ఆర్డర్లు కూడా లేవు. ఉత్పత్తయిన నిల్వలు ప్లాంట్‌లోనే ఉండిపోయాయి. పైగా విశాఖ నుంచి దేశ విదేశాల్లో విశాఖ ఉక్కు ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నారు. ప్లాంట్‌ రాబడిలో 80శాతం విదేశాలకు జరిగే ఎగుమతుల వల్లనే వస్తోంది. కానీ ప్రపంచంలో ఆర్థిక మందగమనం ఉండటంతో 2018-2019 ఆర్థిక సంవత్సరంలో తన ఉత్పత్తిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ తగ్గించుకున్న పరిస్థితులు దాపురించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం  ఉండటంతో ఉక్కు తయారైనా, కొనేవారు లేనందున సగానికి పైగా ఉత్పత్తినిలో స్టీల్‌ప్లాంట్‌ తగ్గించుకుంది. 60 మిలియన్‌ టన్నుల ఉత్పత్తినే చేపట్టగలిగింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఆర్థిక సంవత్సరం 2018లో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు రూ.14,687 కోట్ల విలువైన స్టీల్‌ అమ్మకాలు జరిగాయి. నడుస్తున్న ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ.12750 కోట్లకు పడిపోయాయి. రాజధాని అమరావతి, పోలవరం, ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవడమూ తోడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం  మొత్తం మీద విశాఖ ఉక్కు పరిశ్రమ రూ.20,844 కోట్ల అమ్మకాలు సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరం  రూ.25 వేల కోట్ల అమ్మకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019 డిసెంబరు నాటికి దీనిలో సగం లక్ష్యమే నెరవేరింది. వచ్చే మూడు నెలలు అత్యంత కీలకంగా ఉందని స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం భావిస్తోంది.తాజాగా స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో సిఎండి పికె.రథ్‌ ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడుతూ, ఉక్కు కంపెనీలు దేశ, విదేశాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో కొత్త కార్యక్రమాల వల్ల 'తక్కువ ఉత్పత్తితో కూడా బ్లాస్ట్‌ఫర్నేస్‌లో ఉత్పాదకత చేపట్టడం, అన్ని ఫర్నేస్‌లలోనూ పిసిఐ వాడకం వంటి సాంకేతిక ప్రమాణాలతో ప్రగతి సాధించామని, వీటిని ఇంకామెరుగు పరచుకుని మాంద్యం పరిస్థితులను అధిగమిస్తామని చెప్పారు. నేడు దేశంలో మార్కెట్‌ పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పటికీ 2019 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకూ రూ.12750 కోట్ల అమ్మకాలు సాధించామని, ఎగుమతుల్లో వంద శాతం వృద్ధిని సాధించామని నివేదించారు. ఒడిషా మైనింగ్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం కోసం ప్రభుత్వం కృషి ప్రారంభమైందన్నారు. ఈ చర్యలు ఎంత మేర స్టీల్‌ప్లాంట్‌ను గట్టెక్కిస్తాయో వేచిచూడాల్సిందే.