విజయవాడ జనవరి 30, (way2newstv.com)
ఇంద్రకీలాద్రిపై శ్రీ పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జగన్మాత కనకదుర్గమ్మ బంగారు వీణ చేత పట్టుకుని నెమలి వాహనంపై కూర్చుని సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నది. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాదిగా పాఠశాల, కళాశాలల విద్యార్థులు తరలివస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీ పంచమి వేడుకలు
దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన విద్యార్థులకు ఉచిత దర్శనంతో పాటు వేద పండితులు ఆశీర్వచనాలు, పెన్ను, ప్రసాదం, రక్షా కంకణాన్ని ఆలయ అధికారులు అందచేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు.