జెట్ స్పీడ్ లో విశాఖ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జెట్ స్పీడ్ లో విశాఖ

విశాఖపట్టణం, జనవరి 21 (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అంతిమంగా విశాఖే పెద్ద పీట వేసింది. ఇంతకాలం రాజసంతో ఉన్న విశాఖకు అధికారిక ముద్రతో రాజధాని ట్యాగ్ తగిల్చినట్లైంది. విశాఖను రాజధానిగా ఇప్పటివరకూ మాట వరసకే కీర్తిస్తూ వచ్చారు. సినీ రాజధాని అని, పర్యాటక రాజధాని అని, ఐటీ హబ్ అని బిరుదులు ఇచ్చుకుంటూ పోయారు. కానీ అసలు రాజముద్ర మాత్రం ఇంతవరకూ పడలేదు. వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఫలితంగానే అది దక్కిందన్నది వాస్తవం. మూడు రాజధానుల ప్రతిపాదన ఏ ముహూర్తాన జగన్ చేశారో కానీ అంతిమంగా అది విశాఖకే భారీ లబ్ది చేకూర్చింది.పాలనా వికేంద్రీకరణ ద్వారా కర్నూలుకు న్యాయ రాజధానిని, అమరావతికి శాసనసభను కేటాయించారు. హైకోర్టు రాయలసీమ వాసుల చిరకాల కోరిక అయినప్పటికీ రాజధాని కళ మాత్రం విశాఖదే. 
జెట్ స్పీడ్ లో విశాఖ

ఇక అసెంబ్లీ ఏడాదికి మూడు నాలుగు సార్లు మాత్రమే జరుగుతుంది. దాంతో అక్కడ అమరావతిలో కూడా పెద్దగా సందడి కనిపించదు. అదే సచివాలాయంతో పాటు, సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్ భవన్ కూడా విశాఖకే ఇస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుని చూసినపుడు రాజధాని ఠీవి మొత్తం విశాఖకే దక్కినట్లుగా చెప్పుకోవాలి.విశాఖకు ఇప్పటివరకూ ఏ ఆసరా లేకుండానే ఎదిగింది. ఇపుడు రాజధాని కూడా రావడంతో దక్షిణాదిన మిగిలిన మెగా సిటీలతో పాటుగా ముందుకు సాగేందుకు మహత్తర అవకాశం లభించినట్లైంది. ఇప్పటిక తలసరి ఆదాయంతో దేశంలో టాప్ టెన్ సిటీలలో ఉన్న విశాఖ అభివృధ్ధిని ఇక ఆపలేరని కూడా అంటున్నారు. విశాఖ సైతం ఆ దిశగా ఎంత వరకైనా ఎదగడమే కాదు, సౌత్ లో రేపటి రోజున మిగిలిన నగరాలను సైతం వెనక్కు నెట్టి ముందుకు దూసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.ప్రగతికి కేరాఫ్ గా ఉండడమే కాదు, మిగిలిన పన్నెండు జిల్లాలకు కూడా అర్ధిక చోదకశక్తిగా కూడా విశాఖ నిలిచే అవకాశాలు ఉన్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. విశాఖను ఒక ఇంజన్ గా తీసుకుంటే మిగిలిన జిల్లాల‌ బోగీలలో సహా అయిదు కోట్ల మంది ప్రజలను తీసుకుని సాగిపోయేందుకు బలం పూర్తిగా ఉందని నమ్ముతున్నారు. మరో హైదరాబద్ మాదిరిగా దేశం విశాఖను చూసేలా సాధ్యమైనంత తొందరలోనే ఎదుగుతుందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ సర్కార్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం మూలంగా విశాఖ గత కొన్ని దశాబ్దాలుగా ఊహించని గుర్తింపుతో పాటు గొప్ప లాభాన్ని పొందిందని అంటున్నారు.