న్యూ ఢిల్లీ జనవరి 31 (way2newstv.com)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.5 శాతం ఉంటుందని నివేదిక పేర్కొన్నది.
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
గత ఏడాది కాలంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఆర్థిక సర్వే నివేదికను తయారు చేస్తారు. ఇది కేంద్ర బడ్జెట్తో సమానంగా ఉంటుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ తన టీమ్తో కలిసి ఈ నివేదికను తయారు చేశారు. శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేశారు.