తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారిన మద్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారిన మద్యం

హైద్రాబాద్, జనవరి 2  (way2newstv.com)
కొత్త సంవత్సరంలో జిల్లాలో మద్యం ఏరులై పారింది. ధరలు పెరిగినా మందుబాబులు సీసాలకు సీసాలు మద్యం లాగించేశారు. కొత్త మద్యం పాలసీ వచ్చాక ధరలు భారీగా పెరిగినా, నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల్లో మద్యం ప్రియులు ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాదితో పోలిస్తే కాస్త తగ్గినా, ఒక్క రోజులోనే రూ.6.73 కోట్ల మద్యం తాగేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద బారులు తీరి బాటిళ్లు తీసుకువెళ్లారు. రెండు రోజుల్లోనే ఎక్సైజ్‌ శాఖకు రూ.500 కోట్ల రాబడి వచ్చింది. సాధారణంగా కొత్త సంవత్సరం ముందు మద్యం విక్రయాలు జోరుగా ఉంటాయి. 2019 డిసెంబరు 31న ఒక్కరోజులోనే గ్రేటర్‌ పరిధిలో రూ.90 కోట్లు వరకు మద్యం అమ్మకాలు సాగినట్లు సమాచారం. 
తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారిన మద్యం

గతంలో ఎప్పుడూ ఒక్కరోజులో ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదని ఆబ్కారీశాఖ ప్రకటించింది. ఈ అమ్మకాలను అధికారికంగా ప్రకటించాలంటే మరో రెండురోజుల సమయం పడుతుందని ఆయన వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాలు గ్రేటర్‌ పరిధిలో జోరుగా సాగాయి.ముఖ్యంగా డిసెంబరు 30, 31వ తేదీల్లో వైన్‌ షాపు యజమానులు డిపోల నుంచి పెద్ద మొత్తంలో మద్యాన్ని లిఫ్ట్‌ చేశారు. ఈసారి కూడా మద్యం దుకాణాల యజమానులు పెద్ద మొత్తంలో పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన 19 మద్యం డిపోల నుంచి మద్యంను సరఫరా అయింది. డిసెంబరు 30న ఏకంగా రూ.306 కోట్ల విలువైన మద్యం, బీరు సరఫరా అయింది31న సాయంత్రం 5 గంటల వరకు మరో రూ.150 కోట్ల విలువైన మద్యం, బీరును షాపులకు సరఫరా అయింది. డిసెంబరు 30 వరకే ఏకంగా రూ.1980 కోట్ల రాబడి వచ్చింది. అంటే నెల రోజుల్లో 28 లక్షల కేసుల బీరు, 33 లక్షల కేసుల మద్యం విక్రయమైంది. మద్యం ధరలు పెరిగినప్పటికీ డిమాండ్‌ మాత్రం తగ్గలేదు. జిల్లాలో 20 శాతం మేరకు మద్యం షాపు లు తగ్గించి, విక్రయ వేళ్లలో మార్పులు తీసుకు వచ్చినా మందు బాబులు మాత్రం కిక్కు విషయంలో రాజీపడడం లేదు. వివిధ రకాల బ్రాండ్లు అందుబా టులో లేకపోయినా కిక్కు ఎక్కెందుకు ఏ బ్రాండ్‌ అయితే ఏముందిలే అన్నట్టుగా మద్యం ప్రియులు సర్దుకుపోతున్నారు. న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ ఏపీలో ఏకంగా రూ.92 కోట్ల విలువైన మద్యాన్ని గుటుక్కు మనిపించేశారట. డిసెంబరు 30, 31వ తేదీల్లో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ ద్వారా తెలిసింది. సాధారణంగా సగటున రోజుకు రూ.60 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుండగా, డిసెంబరు 30, 31 తేదీల్లో అంతకుమించి అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ఈ రెండు రోజుల్లో ఏకంగా రూ.170 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. వీటిలో బీర్, లిక్కర్ ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 1.65 లక్షల కేసుల లిక్కర్‌, 60 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి న్యూ ఇయర్‌ను మందుబాబులు ఎంత ఘనంగా ఆహ్వానించారో అర్థం చేసుకోవచ్చు.