హైద్రాబాద్, జనవరి 3, (way2newstv.com)
ఈ సంక్రాంతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆడియో సూపర్ హిట్ కావటంతో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్.ముఖ్యంగా ఇది బన్నీ కెరీర్‌కు కీలకమైన సినిమా కావటంలో ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఓ మై గాడ్ డాడీ పాట సమయంలో తన పిల్లలిద్దరినీ రంగంలోకి దింపిన అల్లు అర్జున్ తాజాగా తన కూతురితో తీసిన మరో వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలాక్స్ అవుతున్న బన్నీ పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు.
దోసెస్టెప్ అంటూ అల్లుకు సెటైర్లు
కూతురితో రాములో రాములో పాటలోని తన స్టెప్ గురించి మాట్లాడిన వీడియోను రిలీజ్ చేశాడు బన్నీ.
అల్లు అర్జున్: నాన్న సినిమా పేరేంటి?
అర్హ: మ్...అల వైకుంఠపురములో
అల్లు అర్జున్: అందులో నాన ఎల్లో కలర్ జాకెట్ వేసుకోని సాంగ్ చేస్తాడు కదా అది ఏం సాంగు.
అర్హ: రాములో రాములో
అల్లు అర్జున్: మ్ రాములో రాములో అందులో ఏ స్టెప్ చేస్తాను
అర్హ: దోస స్టెప్
అల్లు అర్జున్: ఏ స్టెప్ (నవ్వుతూ)
అర్హ: దోస స్టెప్
అల్లు అర్జున్: దోస స్టెప్ వెయ్యి ఒకసారి
అర్హ: ఇలా మొత్తం తిప్పి ఫాస్ట్‌గా తిప్పుతావ్
ఇలా సరదా సరదాగా సాగిన ఈ సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, మురళీ శర్మ, సచిన్ కేడ్కర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.