సుజనా చౌదరి పరపతిపైనే మండలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సుజనా చౌదరి పరపతిపైనే మండలి

విజయవాడ, జనవరి 29, (way2newstv.com
మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత బిజెపి ఎంపి సుజనా చౌదరి సత్తా ఏపాటిదో తేలిపోతుందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎపి కి బిజెపి ప్రతినిధి తానే అనేంతగా కొత్త ప్రభుత్వం వచ్చిన నాటినుంచి ఆయన వ్యవహారం నడుస్తుంది. పేరుకు బిజెపి లో వున్నా చంద్రబాబు కోటరీలో అత్యంత ముఖ్యుడిగా అంతా భావించే సుజనా చౌదరి పైనే టిడిపి జగన్ మండలి రద్దు తో సృష్ట్టించిన సంక్షోభం నుంచి గట్టున పడేస్తారని ఎదురు చూస్తుందంటున్నారు.లాబీయింగ్ లు చేయడంలో ఘనాపాఠి అయిన సుజనా కేంద్రంలో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తారని తమ్ముళ్ళు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.  
సుజనా చౌదరి పరపతిపైనే మండలి

అందుకే మండలి రద్దు అంశం పై టెన్సన్ వద్దే వద్దని చంద్రబాబు, యనమల వంటివారు ఎమ్యెల్సీలకు నచ్చచెప్పారంటున్నారు. కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే సుజనా చౌదరితో మాట్లాడినట్లు చెబుతున్నారు. అందుకే కేంద్రం మండలి రద్దు బిల్లును కోల్డ్ స్టోరేజీలో పడేసేలా సుజనా చౌదరి చర్యలు తీసుకుంటారంటున్నారు.అయితే సుజనా చౌదరికి కేంద్రంలో పట్టు ఉంటే ఇప్పట్లో మండలి రద్దు తీర్మానం కోల్డ్ స్టోరేజ్ కి చేరేలా మోడీ వద్ద చక్రం తిప్పుతారని అంచనా వేస్తున్నారు. కేంద్రం అమరావతి ని వికేంద్రీకరించడానికి అంగీకరించదని, అంగుళం కూడా జగన్ కదల్చలేరంటూ ఘాటు వ్యాఖ్యలే చేసి సుజనా చౌదరి ఇప్పటికే వార్తల్లో హైలెట్ అయ్యారు. ఆయన మాట్లల్లో నిజం ఉంటే ఫర్వాలేదని ఆయనకు అంత సీన్ లేకపోతే మాత్రం నిండా ముంగుతామని టిడిపి ఎమ్యెల్సీల్లో భయం తొంగి చూస్తుందని చెబుతున్నారు.బిజెపి లో సైతం సుజనా చౌదరి వాదనకు భిన్న స్వరాలు వినిపించడంతో ఆయనకు అధిష్టానం వద్ద వున్న పట్టు పై సందేహాలు తెలుగు తమ్ముళ్లలో పొడసూపుతున్నాయి. విపక్షంలో ఉంటే మరో నాలుగేళ్ళు ఎలాంటి పదవుల్లో లేకుండా కొనసాగాలని వారి నుంచి ఆందోళన వ్యక్తం అవుతుందని అంటున్నారు. ఈ నాలుగేళ్ళు ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉండటం నేటి రాజకీయాల్లో చాలా కష్టమైన పనే అన్నది వీరి బాధకు ప్రధాన కారణం అని తెలుస్తుంది.