జిల్లా పంచాయతీ అధికారికి కార్యదర్శులు వినతి
వనపర్తి సెప్టెంబర్ 14, (way2newstv.com)
పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించి మృతిచెందిన పంచాయతీ కార్యదర్శులకు తగిన ఎక్స్గ్రేషియా చెల్లించాలని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘంఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి కి శనివారం వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేష్, ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ . కోశాధికారి కృష్ణనాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు మానసికంగా, శారీరకంగా పని భారంతో సతమతమవుతున్నారని వారన్నారు.
పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించండి
ఇటువంటి పరిస్థితుల్లో శుక్రవారం నాగర్ కర్నూల్జిల్లా లోని గుమ్మడం గ్రామ పంచాయతీ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగిందని వారన్నారు. అలాగే సిద్దిపేట జిల్లాలో లదునూరు పంచాయతీ కార్యదర్శి సిద్ధులు 30 రోజులప్రణాళికలో ఎంపీడీవో కార్యాలయంలో రాత్రి 8:30 గంటల వరకు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరై తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగిందని వారన్నారు. ఇవే ఒత్తిడులుమన జిల్లాలో కూడా ఉన్నాయని. ఇవి పునరావృతం కాకుండా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అలాగే చనిపోయిన వారికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా వారి పిల్లలకు అయ్యే ఖర్చులుప్రభుత్వమే భరించాలని వారన్నారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారి కి అందజేశారు.అనంతరం వారు స్రవంతి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు.
Tags:
News