విజయవాడ, సెప్టెంబర్ 5, (way2newstv.com)
అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంతవరకూ పెదవి విప్పలేదు. రాజధాని అంశం క్రమంగా ఇక మరుగునపడిపోయినట్లే. రాజధానిని అమరావతిలో నిర్మిస్తారా? లేదా? అనే విషయంపై వైఎస్ జగన్ స్పష్టత ఇవ్వక పోవడాన్ని కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అమరావతి రాజధాని విషయంలో ఇంకా స్పష్టత రాకున్నా ఆ:దోళనలు మాత్రం ఒకింత తగ్గాయనే చెప్పాలి. వారం రోజులు హడావిడి చేసిన విపక్షాలు మళ్లీ వేరే అంశాలపై దృష్టిపెట్టాయి.నిజానికి వరదల సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి తేనెతుట్టెను కదలించారు.
అమరావతిని లైట్ గా తీసుకొన్న జగన్
ఆ సమయంలో వైఎస్ జగన్ అమెరికా పర్యటనలో ఉండటం, ఇక్కడ వరద ఉధృతి పెరిగిపోవడంతో దానిని డైవెర్ట్ చేయడానికే రాజధాని అమరావతి అంశాన్ని బొత్స సత్యనారాయణ లేవెనెత్తారన్న వ్యాఖ్యలు విన్పించాయి. దొనకొండ కు రాజధానిని తరలిస్తారంటూ పెద్దయెత్తున ప్రచారమూ జరిగింది. దొనకొండలో భూముల ధరలకు కూడా ఉన్నట్లుంది రెక్కలొచ్చాయి.కానీ వైసీపీ అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినట్లుగానే కన్పిస్తుంది. వరదల అంశాన్ని తెలివిగా పక్కన నెట్టేసిన వైసీపీ ఇక రాజధాని అంశంలో ఎటూ తేల్చలేదు. మరికొద్ది రోజులు రాజధాని అంశంపై ప్రజల్లో చర్చ జరిగితేనే బాగుంటుందని వైెస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఇటీవల రాజధాని అమరావతిలో రెండు రోజుల పాటు పర్యటించి వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. అయినా జగన్ ఈ అంశాన్ని లైట్ గా తీసుకున్నారు. పవన్ ను పెద్దగా పట్టించుకోలేదు.దీనికి కారణాలు కూడా లేకపోలేదంటున్నారు. రాజధాని అమరావతిలో భూముల ధరలు దిగిరావాలన్నదే జగన్ ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. సామాన్యులకు అందుబాటులో భూములు ధరలు ఉన్నప్పుడే ప్రజా రాజధాని అవుతుందని జగన్ భావిస్తున్నారు. అందువల్లే రాజధాని అమరావతి రగడ ఎన్నిరోజులు సాగినా వైఎస్ జగన్ నుంచి స్పందన రాదన్నది పార్టీ వర్గాలు చెబుతున్న విషయం. మొత్తం మీద రాజధాని అంశం రగులుతూనే ఉన్నా జగన్ మాత్రం వెరీ వెరీ లైట్ గా తీసుకున్నారు.
Tags:
Andrapradeshnews