వేలాడుతున్న విద్యుత్ వైర్లు

సాగు కానీ పంటలు
తొలగించకపోతే ఆందోళనలు
వనపర్తి సెప్టెంబర్ 9, (way2newstv.com)
తమ పొలాల మీదుగా అమర్చిన విద్యుత్ వైర్లు ఊయల డోలయానం చేయడమే కాకుండా చేతులకు అందుతూ పొలాలు సాగు చేసుకోలేక పోతున్నా మంటూ గోపాల్పేట రామన్ పాడు సంపుసమీపంలోని రైతులు నిరసనలు  ప్రదర్శిస్తున్నారు. రామన్ పాడు సంపు వెనకాల రాం బోయి ట్రాన్స్ఫార్మర్ దగ్గర  యాప చెట్టు కర్నన్న 
వేలాడుతున్న విద్యుత్ వైర్లు

మరి కొంతమంది రైతులకు సంబంధించిన పొలంలో విద్యుత్వైర్లు డోలయానం చేస్తూ చేతులకు అందుతున్నాయని వారు విచారాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ పరిస్థితి నెలకొని ఎన్నో రోజులు అవుతున్నా కూడా, ఈ విషయం గురించి సంబంధిత లైన్ మెన్,ఏఈ కివిన్నవించినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని వారన్నారు. వీరి కారణంగా చేతికి అందుతున్న వైర్ల కింద తమ పొలాలను సాగు చేసుకో లేక పోతున్నామని వారు విచారాన్ని వ్యక్తపరిచారు. దీని దృష్ట్యా తక్షణమే అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను తొలగించాలని లేకపోతే రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తామని కరోళ్ల బాలరాజు, దేవన్న, దాసు, హనుమంతు, లక్ష్మయ్యతదితరులు హెచ్చరించారు
Previous Post Next Post