విజయారెడ్డి మృతికి సంతాపం

నాగర్ కర్నూలు నవంబర్ 4  (way2newstv.com)
అబ్దుల్లాపూర్ తాహసిల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి సజీవదహన ఘటనపై నాగర్ కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం తరఫున నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో  కలెక్టరేట్ సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. సంఘటనపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 
విజయారెడ్డి మృతికి సంతాపం

నిజాయితీగా పని చేసిన మహిళ అధికారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. అధికారుల పై దాడులను తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బిజినపల్లి,తాడూర్ తాహసిల్దార్ కలెక్టరేట్ సిబ్బంది రెవెన్యూ అధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు
Previous Post Next Post