టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా ఆర్ ఎక్స్ 100 - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా ఆర్ ఎక్స్ 100

హైద్రాబాద్, జూలై 10 (way2newstv.com) 
అందరూ కొత్తవాళ్లే కలిసి చేసిన ఆర్ఎక్స్ 100 అనే చిన్న సినిమా కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.ఆర్‌ఎక్స్‌ 100 సినిమాని రామ్ గోపాల్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అజయ్ భూపతి వేగ్నేష తెరకెక్కించాడు. కార్తికేయ మరియు పాయల్ రాజపుత్ ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు.
 
 
 
టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా ఆర్ ఎక్స్ 100
 
 ఈ సినిమాకు మంచి బజ్ రావడంతో చిత్ర బృందం ఫుల్ జోష్ మీద ఉంది. తాజాగా రిలీజ్ చేసిన రెండో ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తికేయ.. దర్శకుడు అజయ్ భూపతి సినిమాపై భారీ స్టేట్ మెంట్లే ఇచ్చేసి సినిమాకి మరింత హైప్ పెంచేశారు.రొటీన్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లు..అలాంటి సినిమాలే చూస్తాం అనే వాళ్లు ఆర్ ఎక్స్ 100 సినిమాకు రావాల్సిన అవసరం లేదని దర్శకుడు అజయ్ భూపతి చెప్పడం విశేషం. ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తున్నారని..అందకే ఈ సినిమాని తెరకెక్కించానని ఆయన తెలిపారు. ఇక హీరో కార్తికేయ కూడా ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే లాంటి సినిమా ఆర్‌ఎక్స్‌ 100 కాదని తేల్చి చెప్పేశాడు.  50 ఏళ్లకోసారి ఇలాంటి సినిమాలు వస్తుంటాయంటూ అతను చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశాడు. మరి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా మొదలయి..భారీ క్రేజ్ తెచ్చుకుంది ఆర్‌ఎక్స్‌ 100..మరి ఈ సినిమా టీం చెప్పినట్టు ఎంతమేర మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఈ నెల 12 వరకు వెయిట్ చేయాల్సిందే.