కలెక్షన్లతో దూసుకుపోతున్న పంతం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కలెక్షన్లతో దూసుకుపోతున్న పంతం

హైద్రాబాద్, జూలై 10 (way2newstv.com) 
మాస్ హీరో గోపీచంద్‌ ఎట్టకేలకు హిట్టు కొట్టారు. గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్‌కు ‘పంతం’ మంచి రిలీఫ్ ఇచ్చింది. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ ప్రభావం వసూళ్లపై పడలేదు. సినిమాకు మంచి ప్రచారం చేయడం, ట్రైలర్‌లో సోషల్ మెసేజ్‌తో కూడిన డైలాగులు ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కామెడీ, యాక్షన్, సోషల్ మెసేజ్ కలగలిపిన సినిమాతో గోపీచంద్ ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేశారు. కొత్తదనం ఏమీలేకపోయినా రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడికి వినోదం పంచారు. ఈ ఫార్ములా బాగానే పనిచేసింది. తొలి వారం (నాలుగు రోజులు) ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా ‘పంతం’ రూ.10.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.6.77 కోట్లు. గోపీచంద్ కెరీర్‌లోనే ఈ వసూళ్లు అత్యధికం కావడం విశేషం. గోపీచంద్ తన 25వ సినిమాతో ఈ ఫీట్‌ను సాధించాడు. రచయిత కె.చక్రవర్తి దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. మెహ్రీన్ గ్లామర్ కూడా సినిమాకు బాగానే కలిసొచ్చింది. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడం కూడా ‘పంతం’కు కలిసొచ్చింది. కలెక్షన్లతో దూసుకుపోతున్న పంతం