టాప్ గేర్ లో ఆర్ ఎక్స్ 100 - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టాప్ గేర్ లో ఆర్ ఎక్స్ 100

హైద్రాబాద్, జూలై 16 (way2newstv.com) 
గత గురువారం విడుదలైన RX 100 మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. చిత్ర పరిశ్రమకు పూర్తిగా కొత్త వారైన హీరో, దర్శకుడి నుంచి వచ్చిన ఈ చిత్రం ఊహించని రీతిలో కలెక్షన్లను రాబడుతోంది. వైవిధ్య అంశాలతో విడుదలకు ముందే ‘ఆర్ఎక్స్ 100’లోని రొమాంటిక్ సీన్లు, వూహించని ట్విస్టులు యువతను థియేటర్లకు మళ్లిస్తున్నాయి. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్లను చూసేందుకు యూత్ ఎగబడుతున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది రూ.2.70 కోట్లకు అమ్ముడుపోయిన ఆర్ఎక్స్ 100 తొలి రోజు రూ.1.40 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు కూడా ఈ మూవీ దూకుడు తగ్గలేదు. రెండో రోజు ఈ చిత్రం రూ.1.10 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండు రోజుల్లో రూ.2.53 కోట్లు రాబట్టిన ఈ చిత్రం దాదాపు బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు చేరుకుంది. రెండో రోజు నైజాం ఏరియాలో రూ.50 లక్షలు రాబట్టిన ఆర్ఎక్స్ 100.. సీడెడ్‌లో 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.14 లక్షలు రాబట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో రూ.9.72 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.5.65 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.6.72 లక్షలు, గుంటూరులో రూ.7 లక్షలు, నెల్లూరులో రూ.3 లక్షల మేర కలెక్షన్లు రాబట్టింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉండటంతో ఈ వీకెండ్‌ ముగిసే సరికి ఆర్ఎక్స్ 100 రూ.6 కోట్లకుపైగా కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారని టాక్. 
 
 

టాప్ గేర్ లో ఆర్ ఎక్స్ 100