కుమారస్వామికి కాంగ్రెస్ ఓదార్పు! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కుమారస్వామికి కాంగ్రెస్ ఓదార్పు!

బెంగళూర్ జూలై 16 (way2newstv.com) 
కన్నడనాట సంకీర్ణ ప్రభుత్వాన్ని తాను ఎంతో కష్టంతో నడుపుతూ ఉన్నానని, తనకిప్పుడు విషం మింగుతున్నట్టు ఉందని కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓదార్పు వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కుమారస్వామి ధైర్యంగా ఉండాలని, సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు. "ఓ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఎప్పుడూ కష్టమే. ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఎదురవుతుంది. సమస్యను సెక్యులర్ పార్టీలకు మద్దతిస్తున్న ప్రజల ముందు పెట్టడం మంచి పద్ధతి కాదు. అది తప్పుడు సంకేతాలను పంపిస్తుంది. ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొనేందుకు కుమారస్వామి ధైర్యంగా ఉండాలి. ప్రజల కోరికలను నెరవేర్చాలి" అని వ్యాఖ్యానించారు. శనివారం నాడు జేడీ(ఎస్) నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన కుమారస్వామి కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కుమారస్వామికి కాంగ్రెస్ ఓదార్పు!