ప్రాజెక్టు అంచనాలు పెంచుతున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రాజెక్టు అంచనాలు పెంచుతున్నారు

హైదరాబాద్, జూలై 14  (way2newstv.com)
ఈ పార్లమెంట్ సమావేశాలలో  ముఖ్యమంత్రి కేసీఆర్  విభజన చట్టం అమలు కోసం వత్తిడి తీసుకురావాలి. కేసీఆర్ ఈ అంశంపై ఇంతవరకు నోరు విప్పలేదని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. హామీలన్నీ అమలైయ్యాయా అని అడిగారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎన్ని అప్పులు తీసుకొచ్చారో .. దేనికి ఎంత ఖర్చు చేశారో వైట్ పేపర్ రిలీజ్ చెయ్యాలని అయన డిమాండ్ చేసారు. ప్రాజెక్ట్స్ అంచనాలు ఎప్పటికప్పుడు విచ్చల విడిగా పెంచుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చెయ్యాలి. పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వ వైఖరేంటో స్పష్టం చెయ్యాలి.కేసీఆర్ పాలన గాలికి వదిలేసి ఎన్నికల మేనేజ్ మెంట్ లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో క్వాలిటీ  మేనేజ్ మెంట్ సిస్టమ్ మ్యానివల్ ఉండాలి. టిఆర్ఎస్ బీజేపీ కి బీ టీమ్ గా పనిచెస్తుంది. ఈ రెండు పార్టీల పరస్పర విమర్శలు మ్యాచిఫిక్సింగ్ లో భాగమేనని విమర్శించారు. పరిపూర్ణానంద బహిష్కరణ కూడా ఇందులో భాగమే. రుణమాఫీ పై మా ప్రణాళిక మాకు ఉంది. చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే .. మనస్సు ఉంటే మార్గం ఉంటుందని అన్నారు. 



ప్రాజెక్టు అంచనాలు పెంచుతున్నారు