1500 రోజుల నవ్యాంధ్ర ప్రగతిని చాటి చెబుదాం తెలియక చేసిన తప్పులుంటే సరిదిద్దుకుందాం - ప్రజల సలహాలను శిరసావహిద్దాం కృష్ణానదిపై 19 బ్రిడ్జి లను నిర్మిస్తాం గొల్లపూడి "గ్రామదర్శిని - గ్రామ వికాసం" ప్రారంభోత్సవంలో ఏపీ మంత్రి దేవినేని ఉమా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

1500 రోజుల నవ్యాంధ్ర ప్రగతిని చాటి చెబుదాం తెలియక చేసిన తప్పులుంటే సరిదిద్దుకుందాం - ప్రజల సలహాలను శిరసావహిద్దాం కృష్ణానదిపై 19 బ్రిడ్జి లను నిర్మిస్తాం గొల్లపూడి "గ్రామదర్శిని - గ్రామ వికాసం" ప్రారంభోత్సవంలో ఏపీ మంత్రి దేవినేని ఉమా

విజయవాడ రూరల్, జూలై 17 (way2newstv.com)   
రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారంనాడు గొల్లపూడి లో గ్రామదర్శిని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలిరాగా వందలాది మంది ప్రజల సమక్షంలో పదిహేను వందల రోజుల ప్రగతి కార్యక్రమాలను మంత్రి ఉమా వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిద్రాహారాలు లేకుండా నవ్యాంధ్ర ప్రగతికోసం కష్టపడుతున్నట్లు చెప్పారు. 1500 రోజుల్లో కనీవినీ ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రజా రాజధాని అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, దుర్గ గుడి వద్ద బ్యారేజ్, వైకుంఠపురం వద్ద బ్రిడ్జి, గన్నవరం ఎయిర్పోర్ట్ ఆధునీకరణ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, పింఛన్లు, చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు పండుగ కానుకలు, గ్రామాల్లో సిసి రోడ్లు గ్రావెల్ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు చెప్పారు. 
 
 
 
1500 రోజుల నవ్యాంధ్ర ప్రగతిని చాటి చెబుదాం 
తెలియక చేసిన తప్పులుంటే సరిదిద్దుకుందాం - ప్రజల సలహాలను శిరసావహిద్దాం
కృష్ణానదిపై 19 బ్రిడ్జి లను నిర్మిస్తాం
గొల్లపూడి "గ్రామదర్శిని - గ్రామ వికాసం" ప్రారంభోత్సవంలో ఏపీ మంత్రి దేవినేని ఉమా
 
 
రాష్ట్రంలో శాంతి భద్రతలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో అధికారపక్షం, విపక్షమూ తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. ఇటు అసెంబ్లీలోనూ, పార్లమెంట్లోనూ రాష్ట్ర ప్రగతి కోసం పోరాడుతున్నది పనిచేస్తున్నది తెలుగుదేశం పార్టీనేనని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి 15వందల రోజుల రాష్ట్ర ప్రగతిని ప్రజలకు వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు. చేసిన పనులను చెబుతూనే చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలని గుర్తు చేశారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరించి జనవరిలో జరిగే జన్మభూమి లో పరిష్కార దిశగా పని చేయాలని కోరారు. తానెప్పుడూ మాటలు చెప్పనని చేతల్లోనే చేసి చూపుతానని తెలిపారు. మైలవరం నియోజకవర్గంలోని 5 మండలాలలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసినట్లు చేసిన ప్రతి ఒక్క పనిని కరపత్రాల రూపంలో పుస్తకాల రూపంలో ప్రజల ముందుంచానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు మైలవరం ప్రగతి గూర్చి తెలియకపోతే ఆ పుస్తకాలను చదివి తెలుసుకోవాలని హితవు చెప్పారు. భవిష్యత్తులో గొల్లపూడి మరో కూకట్ పల్లి అవుతుందని, వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా వైకుంటపురం బ్రిడ్జికి శంకుస్థాపన చేపిస్తామని తెలిపారు. ఇప్పటికీ 67 సార్లు పొలవరం రివ్యూలు జరిగాయని, 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చి తీరుతామని శపథం చేశారు. ఈ రోజు తాను గొల్లపూడిలో దళిత కుటుంబంలోనే రాత్రి బస చేసి రేపు చిలుకూరు పర్యటనకు వెళతానని తెలిపారు.