కాంగ్రెస్ లో ఎవరైనా సీఎం కావచ్చు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్ లో ఎవరైనా సీఎం కావచ్చు

యాదాద్రి భువనగిరి, జూలై 17 (way2newstv.com)   
భువనగిరి జయలక్ష్మి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్థాయి విస్తృత సమావేశం  జరిగింది. ఈ భేటీకి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య,  మాజీ ఎంపీ రాజగోపాల్ రెడ్డి , డీసీసీ బిక్షయ్య , మల్లు రవి,  టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ కుంభం అనీల్ కుమార్ రెడ్డి హజరయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పటిష్ట పరచడం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో స్పష్టమైన మెజారిటీ తో తెలంగాణ ను సోనియాకు అందియ్యాలని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ కష్టపడే వ్యక్తులకు అవకాశం ఇస్తారు. సమన్వయంతో పని చేసి తెలంగాణ లో కాంగ్రెస్ ను నిలబెట్టాలి. నల్గొండ జిల్లా విప్లవాల ఖిల్లా ఆ ఖిల్లా లో గెలుపు కాంగ్రెస్ దే కావాలని అన్నారు. తెలంగాణ ప్రజలంతా నల్లగొండ దిక్కు చూస్తుండ్రు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అంతా ఒక్కటైతే...కేసీఆర్ పరార్ అవ్వడం ఖాయమని అన్నారు. చివరగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి అవుతుందంటే, మనకు ఇంకేం కావాలని  అయన అన్నారు. భువనగిరి లో వర్గ విభేదాలు లేవు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బ్రతికోవడమే మన లక్ష్యం. కేటీఆర్ కండ్లు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారు కండ్లు దించే సమయం వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే టికెట్ అడిగే హక్కు ఉంది.  కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ లో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు కానీ టిఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ తప్ప ఎవరికి అవకాశం ఉండదని అన్నారు. కాంగ్రెస్ లో ఎవరైనా సీఎం కావచ్చు