జూలై 25న సన్నీ అన్ టోల్డ్ స్టోరీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూలై 25న సన్నీ అన్ టోల్డ్ స్టోరీ

ముంబై, జూలై 2, (way2newstv.com)
సన్నీ లియోన్.. ఇండియాలో అత్యధిక ప్రజలు గూగుల్ సెర్చ్ ద్వారా వెతికే సెలబ్రిటీల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే పేరు ఇది. సన్నీ అసలు పేరు.. కరణ్‌జీత్ కౌర్. ఈమె భారతీయ సిక్కు కుటుంబంలో జన్మించింది. బాల్యంలో ఎంతో అమాయకంగా ఉండే కరణ్‌జీత్.. పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌గా ఎలా మారిందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే.. ఆమె జీవిత కథతో ఓ సినిమా సిద్ధమైపోయింది. ఈ చిత్రం టీజర్‌ను సన్నీ ఆదివారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘పక్కింటి అమ్మాయి లాంటి కరణ్‌జీత్ కౌర్.. పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్’గా మారడం, ఇండియాలో మోస్ట్ గూగుల్డ్ సెలబ్రిటీగా ఎదిగి.. చివరికి ఆమె ఈవెంట్లనును రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం వంటి క్లిప్స్‌తో ఈ టీజర్‌ను రూపొందించారు. అయితే, ఈ ప్రివ్యూ.. థియేటర్లలో విడుదల కాదు. ‘జీ5 ఇండియా’లో జులై 16 ఆన్‌లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. ‘‘నా జీవితం త్వరలో తెరిచిన పుస్తకం కాబోతుంది. జులై 16న కరణ్‌జీత్ కౌర్ నుంచి సన్నీ లియోన్ వరకు నా జర్నీని చూడండి’’ అని సన్నీ ట్విట్టర్లో పేర్కొంది. మరి, ‘కరణ్‌జీత్ కౌర్.. ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ టీజర్‌ వచ్చేసింది.
 
 
 
జూలై 25న సన్నీ అన్ టోల్డ్ స్టోరీ