ఆసియాలో వాణిజ్య కూటమి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆసియాలో వాణిజ్య కూటమి

న్యూఢిల్లీ, జూలై 2, (way2newstv.com)
ఆసియా దేశాలతో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమి ఏర్పాటుకు బీజాలు పడ్డాయి. జపాన్‌లోని టోక్యో నగరంలో  జరిగిన సమావేశంలో 16 దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఈ దిశగా చర్చించారు. చైనా, జపాన్, భారత్‌ లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కలయికతో ఏర్పాటు కానున్న ఈ కూటమి అత్యంత కీలకంగా మారనుంది. అమెరికా లేకుండా రూపొందుతున్న ఈ కూటమి ప్రపంచాన్నే శాసిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరి నాటికే ‘రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పాట్నర్‌షిప్ (ఆర్‌సీఈపీ)’ కూటమి ఏర్పాటు పూర్తవుతుందని ఆర్థిక మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 16 దేశాలతో పాటు ఆగ్నేసియాకు చెందిన మరో 10 దేశాలతోనూ వాణిజ్యాన్ని సులభతరం చేసే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ దేశాలకూ ఇందులో భాగం కల్పించనున్నారు. ఈ వాణిజ్య కూటమి వాస్తవ రూపం దాలిస్తే.. ప్రపంచంలో మూడో వంతు ప్రజలు దీని కిందకి వస్తారు. వివిధ దేశాల మధ్య వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరమవుతాయి. ఇప్పటికే అమల్లో ఉన్న వాణిజ్య కూటములకు ఆర్‌సీఈపీ పెను సవాలుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈయూ కూటమి మాదిరిగానే దీనికి కూడా పలు ఇబ్బందులు ఎదురుకావొచ్చని అంటున్నారు. వివిధ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, వైరుధ్యాల నేపథ్యంలో కూటమి భవితవ్యంపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని చెబుతున్నారు. ఆసియాలో వాణిజ్య కూటమి