ఏడాదిలోగా పోలవరం నీరు-ప్రగతి టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏడాదిలోగా పోలవరం నీరు-ప్రగతి టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబ

అమరావతి, జూలై 17 (way2newstv.com)
పోలవరం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.  సోమవారం నాడు అయన  నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణానుంచి నీళ్లు రాకపోయినా, పట్టిసీమ ద్వారా సాగునీరు ఇస్తున్నామని ఆయన అన్నారు. ఎపికి కేంద్రం సహకరించనందువల్లే ఎన్డిఎనుంచి బైటికి వచ్చామని ఆయన చెప్పారు. ఇంత చేస్తున్న నాకు మీరంతా అండగా నిలపడాలన్నారు. మనం కేంద్రానికి బానిసలం కాదని కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. ఒక్క ఓటు వేరేవారికి వేసినా అన్యాయం చేసినట్టే. మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతా. అన్ని రంగాల్లోనూ దేశంలో మనమే నెంబర్ ఒన్. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ అవుతామని అయన అన్నారు. రాష్ట్రంలో పడవ ప్రమాదాలు పెను సమస్యగా మారాయని ఆయన అన్నారు. జల నియంత్రణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వంశధార నదిలో చిక్కుకుపోయిన కూలీలను రక్షించిన సిబ్బందిని ఆయన అభినందించారు. రెవెన్యూ, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేసి, అందరినీ కాపాడారని అభినందించారు. తరువాత అయన గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించి  సీఎం పోతార్లంక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంతో 10 లంక గ్రామాలలోని 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 



ఏడాదిలోగా పోలవరం 
నీరు-ప్రగతి టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబ