వరుస ఫ్లాపులతో గోపిచంద్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వరుస ఫ్లాపులతో గోపిచంద్

హైద్రాబాద్, జూలై 6, (way2newstv.com) 
ఒకప్పుడు భిన్న జోనర్స్ లో సినిమాలు చేసి ఆకట్టుకున్న గోపిచంద్..వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు. తాజాగా నటించిన పంతం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని సిద్ధమయ్యాడు. నూతన దర్శకుడు చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవలే రిలీజైన పంతం సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం. గోపిచంద్ ఈ సారి హిట్ కోసం కాస్త గట్టిగానే పంతం పట్టాడు.  ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు గోపిచంద్. అలాగే చిత్ర దర్శకుడు చక్రవర్తి కూడా సినిమా విజయం విషయంలో ముందునుంది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు వారి నమ్మకం నిజమైంది. సినిమా పాజిటీవ్ టాక్ తో ముందుకు వెళ్తుంది. ఈ సమ్మర్ లో వచ్చిన రంగస్థలం తర్వాత సరైన మాస్ సినిమా లేక ప్రేక్షకులు డీలాపడ్డారు. ఈ సమయంలో సోషల్ మెసేజ్ ను బేస్ చేసుకుని పూర్తి కమర్షియల్ హంగులతో వచ్చిన పంతం సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. గోపి సుందర్ అందించిన బాణీలు ఆకట్టుకుంటున్నాయి.గోపిచంద్ 25వ సినిమాగా వచ్చిన  పంతంలో రెజీనా హీరోయిన్ గా నటించింది. తన మార్క్ పెర్పామన్స్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు గోపి.  మరి ఇప్పటికే పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తున్న పంతం ఏ రేంజ్ విజయం సాధిస్తుందో తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
 
 
 
వరుస ఫ్లాపులతో గోపిచంద్