ఆర్టీసీ బస్ స్టేషన్లలలో సినిమాధియేటర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్టీసీ బస్ స్టేషన్లలలో సినిమాధియేటర్లు

హైద్రాబాద్, జూలై 5, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ 23 ప్రధాన బస్‌స్టేషన్లలో సినిమా థియేటర్లను నిర్మించనుంది. ఆర్‌టిసికి ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించింది. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్‌టిసి ఎం డి, ఇతర ఉన్నతాధికారుల బృందం కొద్ది రోజులు గా సమావేశాల్లో చర్చించడంతో పాటు నిపుణుల సలహాలను పరిశీలించింది. బస్టాండ్ స్థలాల్లోనే సినీ మల్ట్లిప్లెక్స్ థియేటర్ల ఏర్పాటు కోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన ఉన్నతాధికారుల బృం దం రాష్ట్రంలో 23 బస్‌స్టేషన్లు అనువైనవిగా గుర్తించింది. రోడ్ మ్యాప్‌నూ తయారు చేసింది. హైదరాబాద్ జోన్ పరిధిలో 9 బస్‌స్టేషన్లు, కరీంనగర్ జోన్ పరిధిలో 14 బస్‌స్టేషన్‌లలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్  ఏర్పాటుకానున్నాయి. ఒక్క కరీంనగర్ బస్టాండ్ మాత్రం మొదటి అంతస్తులో థియేటర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా 22 చోట్ల క్రింది అంతస్తుల్లోనే నిర్మాణాలకు అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు.
 
 
 
 ఆర్టీసీ బస్ స్టేషన్లలలో సినిమాధియేటర్లు
 
మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల (800 చ.అడుగులు), రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ (800 చ.అ), మెదక్ జిల్లా నర్సాపూర్ (800 చ.అ), సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగారెడ్డి ( 800 చ.అ), నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (1,110 చ.అ), వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ (800 చ.అ), తాండూరు (1324 చ.అ), ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ (1667 చ.అ), ఆసిఫాబాద్ (750 చ.అ), నిర్మల్ (1667 చ.అ), ఖమ్మం జిల్లాలోని సత్తుపలి (1,111 చ. అ), కల్లూరు (556 చ.అ), కొత్తగూడెం ( 800 చ.అ), కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి (1,111 చ.అ), హుజూరాబాద్ ( 500 చ.అ), సిరిసిల్ల ( 1667 చ.అ), పెద్దపల్లి ( 1361 చ.అ), వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ (1,111 చ.అ), నిజామాబాద్ జిల్లా ఆర్మూరు (1667 చ.అ), బోధన్ (1,111 చ.అ) గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్ ప్లాట్లలోనే సినిమా థియేటర్లను నిర్మించనున్నారు. ఇక పోతే హైదరాబాద్, సూర్యాపేట తర్వాత విస్తీర్ణంలో అతి పెద్దదైన కరీంనగర్ బస్టాండ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో థియేటర్‌ను నిర్మించనున్నారు.