ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి

 హైదరాబాద్ జూలై 14 (way2newstv.com)
ఓటు అనేది ప్రతి వయోజనునికి వజ్రాయుధం వంటిదని,రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరు సద్వినియోగం  చేసుకోవాలని అందుకు అర్హులైన వారందరూ ఓటరు గా నమోదు చేడుకోవాలని టిఆర్ఎస్ డివిజన్ అద్యక్షులు అశోక్ ముదిరాజ్ పిలుపు నిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ  ఆదేశం మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గం లో  ముమ్మరంగా ఓటరు  నమోదు కార్యక్రమం సాగుతుంది.అందులో బాగంగా బౌద్ద నగర్ డివిజన్ కేంద్రం లో ఓటరు నమోదు  కార్యక్రమాన్ని చేపట్టారు.కొత్తగా ఓటరు నమోదు తో పాటు గతం లో ఓటరు లిస్టు లో పేరు ఉండి ప్రస్తుతం లేని వారిని గుర్తించి డివిజన్ కు చెందిన టిఅర్ఎస్ నాయకులూ ధనుంజయగౌడ్,నిర్మలముదిరాజ్,ఎన్ ఆంజనేయులు(అంజూర్),బల్లగీత,రాంబాబు,సులోచన  తదితరులు ఓటరులుగా నమోదు చేసారు.ఈ కార్యక్రమం లో అనేక మంది యువకులు,మహిళలు పాల్గొని ఓటరుగా నమోదు చేసుకున్నారు.ఓటరు లిస్టు లో పేరు లేనివారు  తిరిగి ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని నేతలు పిలుపు నిచ్చారు.
 
 
 
ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి
Previous Post Next Post