దూకుడు పెంచిన బీజేపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దూకుడు పెంచిన బీజేపీ

విజయవాడ, జూలై 21 (way2newstv.com)
లోక్‌సభలో అవిశ్వాసం వీగిపోయాక బీజేపీ దూకుడు పెంచింది. టీడీపీ, చంద్రబాబు టార్గెట్‌గా ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్యాకేజీకి ఓకే చెప్పిన ఏపీ సీఎం.. ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకున్నారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ట్విట్టర్‌లో తనదైనశైలిలో స్పందించారు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాం మాధవ్. తన ట్వీట్‌లో ‘ ఇది 2016 సెప్టెంబర్ 14నాటి పేపర్ హెడ్ లైన్స్. సీఎం చంద్రబాబు ప్రధానికి కాల్ చేసి.. స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞ‌తలు తెలిపారు. ఇప్పుడేమో అబద్ధాలు చెబుతున్నారు. అది చంద్రబాబు నైజం’అన్నారు. 
టాప్ వ్యాఖ్యఇటు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కూడా బాబును టార్గెట్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ సాయం చేయలేదనడం సరికాదని.. హోదాకు సమానంగా వచ్చే ప్రయోజనాలు ఇస్తామని గతంలోనే చెప్పాం.. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చట్టంలో లేనివి కూడా కేంద్రం చేసిందన్న ఆయన.. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన 11 సంస్థల్లో ఇప్పటికే 10 మంజూరయ్యాయని చెప్పారు. కాని రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. పెట్రోలియం వర్శిటీకి ఇంత వరకు స్థలం కేటాయించకపోవడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. 
 
 
 
 దూకుడు పెంచిన బీజేపీ
 
దుగరాజు పట్నం, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్‌ల కోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు బీజేపీ ఎంపీ. ఏపీ అభివృద్ధిలో కేంద్రం నుంచి సహకారం కచ్చితంగా ఉందన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి. విభజన చట్టం ప్రకారం ఏమీకి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరువేరుస్తున్నామని.. అయినా కేంద్రం రాష్ట్రానికి ఏం చేయలేదంటూ టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ పార్టీ పెడితే.. కాంగ్రెస్‌‌తో కలిసి అవిశ్వాసం పెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ నేతలు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చ సమయంలో ఏపీ గురించి ఒక్కమాట మాట్లాడలేదని.. అలాంటి వాళ్లతో కలిసి రాజకీయాలు చేస్తూ.. మళ్లీ వాళ్లకు కృతజ్ఞ‌తలు చెప్పడానికి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014లో అశాస్త్రీయంగా జరిగిన విభజనలో టీడీపీ పాత్ర కూడా ఉందన్నారు పురందేశ్వరి. ఏపీ విభజనకు చంద్రబాబు కూడా సహకరించలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడేమో విభజననాటి అంశాలను ప్రస్తావిస్తూ.. బీజేపీపై ఆ నెపాన్ని తోస్తూ.. ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2019లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మళ్లీ మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు.