ఆల్ టైమ్ రికార్డ్ లో సెన్సెక్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆల్ టైమ్ రికార్డ్ లో సెన్సెక్స్

ముంబై, జూలై 13 (way2newstv.com)  
ట్రేడింగ్‌ ప్రారంభంనుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. చుమురు కంపెనీలు, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఇచ్చిన ఉత్సాహంతో మార్కెట్లు భారీగా లాభాల్లో ప‌య‌నిస్తున్నాయి. ఒక ద‌శ‌లో 400 పాయింట్ల వ‌ర‌కూ లాభ‌ప‌డ్డ సెన్సెక్స్ త‌ర్వాత కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. మ‌ధ్యాహ్నం 1.33 గం.ల స‌మయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 427 పాయింట్లు బ‌ల‌ప‌డి 36,693.80 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, నిఫ్టీ 117.10 పాయింట్లు ఎగ‌బాకి 11,065 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. హెచ్‌సీఎల్ టెక్నాల‌జీ షేర్లు 1.25% లాభ‌ప‌డ్డాయి. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్ 5 శాతం ఎగ‌బాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 100 బిలియ‌న్ డాల‌ర్లు దాటేసింది. టీసీఎస్‌ ఫలితాల కారణంగా జూన్‌ త్రైమాసికం సానుకూలంగా ఉండవచ్చనే అంచనాలను పెంచింది. మార్చి త్రైమాసికానికి ఇండియా జీడీపీ పెరుగుదల 7.7 శాతానికి పెర‌గ‌డం కూడా దీనికి తోడైంది. మ‌రో వైపు ఈ రోజు విడుద‌ల కానున్న టెక్ కంపెనీ సెయింట్, క‌ర్నాట‌క బ్యాంక్ ఫ‌లితాల‌పై ఇన్వెస్ట‌ర్లు సానుకూలంగా ఉన్నారు.
 
 
 
ఆల్ టైమ్ రికార్డ్ లో సెన్సెక్స్