రైతుల ఆశలు..అడియాశలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతుల ఆశలు..అడియాశలు

కర్నూలు, జూలై 6, (way2newstv.com)
దట్టమైన మేఘాలు ఆవరిస్తూ, చిమ్మ చీకట్టు అలుముకుంటూండడంతో భారీ వర్షాలు కురుస్తాయనే ఆశలను రేపుతున్నాయి. అయితే మేఘాలు కరుణించకుండా వెళ్లిపోతూండడంతో రైతుల ఆశలు అడియాసలు అవుతున్నాయి.కారు మబ్బులతో నిండిన మేఘాలు ఊరిస్తూ వెళ్తోన్నాయి చినుకు పడడం లేదు. ప్రతి ఏడూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటూండడంతో రైతులు పంటల సాగుపై పెట్టుకుంటున్న ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఈ ఏడాది జూన్ మాసం ప్రారంభంలో తొలకరి చినులు పలకరించాయి. దీంతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే రైతులు ఖరీఫ్‌పై ఆశలను పెంచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు 1.34లక్షల హెక్టార్లు కాగా జూన్ మాసం ముగుస్తున్నా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 3వేల హెక్టార్లలో పంట సాగు అయినట్లు తెలుస్తోంది. జూన్ మాసంలో రైతులు పంటల సాగు ప్రారంభించి జూలైలో పూర్తి చేస్తారు. జిల్లాలో జూన్ మాసంలో 51మండలాల్లో 30శాతం మించి వర్షం కురిసింది. 
 
 
 
రైతుల ఆశలు..అడియాశలు
 
13మండలాల్లో సాధారణ వర్షపాతం కురవగా, మిగతా మండలాల్లో నామమాత్రపు వర్షపాతం నమోదయింది. అయితే పంటల సాగు సమయానికి ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 87మి.మీ వర్షపాతం నమోదైంది. నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు బాగా తగ్గింది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు 1.34లక్షల హెక్టార్లు కాగా జూన్ మాసం ముగుస్తున్నా 3వేల హెక్టార్లు సాగు విస్తీర్ణంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ ఏడది జూన్ మాసంలో కురిసిన వర్షపాతం తక్కువగా నమోదైంది. జూన్ ప్రారంభంలో ఆశలు రేపుతూ కురిసిన చినుకులతో రైతులు పత్తి, వేరుశనగ పంటలను ఇప్పటికే కొంతమేర సాగు చేశారు. మొలకెత్తుతున్న సమయంలో మేఘాలు ఊరిస్తూ వెళ్తూండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వాతావరణ నిపుణుల అంచనాల్లో ఈ జూలై నెలలో కూడా 32శాతం వర్షపాత లోటు ఉంటుందని వస్తున్న వార్తలతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో కష్టనష్టాలతో ఉన్న రైతాంగానికి మరో మారు కరువు పరిస్థితులు కళ్లముందు మెదలుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో జూన్ మాసంలో మాదిరిగానే మిగతా మాసాల్లో కూడా వరుణుడి కరుణ లేకుంటే కరువు తప్పనిసరి పరిస్థితిగా మారింది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకుంటే ఒకింత ఉపశమనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఖరీఫ్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్న రైతులకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకుపక్రమిస్తున్నారు.