తెరాస, బీజేపీవి ఓట్ల రాజకీయం : టీటీడీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెరాస, బీజేపీవి ఓట్ల రాజకీయం : టీటీడీపీ

హైదరాబాద్, జూలై 17 (way2newstv.com)   
విభజన హామీలగురించి టిఆర్ఏస్ ప్రభుత్వం ఏంధుకు కేంద్రం పై ఒత్తిడి తీసుకురావట్లేదు. బీజేపీ ప్రభుత్వం తో టిఆర్ఏస్ లాలూచిపడిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ అన్నారు. సోమవారం నాడు అయన ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ర్టం విభజన హామీల గురించి ఆ ప్రభుత్వం పోరాడుతుంటె మీరేం చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం కడపలో అక్కడి నేతలు పోరాడుతున్నారు...మీరెందుకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి పోరాటం చేయట్లేదని ప్రశ్నించారు. బయ్యారం  స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకు టీడీపీ పోరాడుతుంది.. ఈ నెల 27న ఏంపీ గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో చలో ములుగు కు పిలుపు నిస్తున్నామని అన్నారు.గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు  కై ములుగు లో బహిరంగసభ  పెడతాం. వెనుక బడిన జిల్లా లలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాం. టిఆర్ఏస్, బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. విభజన హామీల పై అఖిలపక్షం ను కేసీఆర్ ఢిల్లీ కు తీసుకెళ్ళాలని అయనఅన్నారు.
 
 
 
తెరాస, బీజేపీవి  ఓట్ల రాజకీయం : టీటీడీపీ