కరుణానిధిభౌతికకాయానికి కేసీఆర్‌ నివాళ్ళు

చెన్నైఆగష్టు 8  (way2newstv.com)
రాజాజీ హాల్‌లో ద్రవిడ ఉద్యమ సారథి, డీఎంకే అధ్యక్షుడు ముత్తువేల్ కరుణానిధి(94)భౌతికకాయానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. సీఎం వెంట ఎంపీ కవిత,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కరుణానిధి భౌతికకాయం వద్ద స్టాలిన్, కనిమొళి కుటుంబసభ్యులను కేసీఆర్‌ పరామర్శించారు. అంత‌కుముందు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. కావేరి ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం కరుణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కరుణానిధి మృతిపట్ల్ల కేసీఆర్ సంతాపం కూడా తెలిపారు. సామాన్య జనాలకు రాజకీయ చైతన్యం కలిగించిన కొద్ది మందిలో ఒకరిగా కరుణానిధి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
 
 
 
కరుణానిధిభౌతికకాయానికి కేసీఆర్‌ నివాళ్ళు
Previous Post Next Post