స్వచ్ఛత కోసం డివిజన్ల మధ్య పోటీ

కరీంనగర్, ఆగస్ట్ 10, 2018 (way2newstv.com)
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఈమేరకు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తోంది. ఇక తెలంగాణరాష్ట్రం కూడా ఈ కార్యక్రమం అమలుకు ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఇక స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ర్యాంకులు ప్రకటించి కార్పోరేషన్‌లను ప్రోత్సహిస్తోంది కేంద్రం. స్వచ్ఛ్ కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ స్ఫూర్తితో పలు నగరాల్లో పరిశుభ్రతను మెరుగు పర్చడానికి సర్కార్ కృషిచేస్తోంది. కరీంనగర్‌లో అయితే నగరపాలిక స్వచ్ఛ డివిజన్ల పేరుతో పోటీ నిర్వహించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కార్పోరేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణను మరింత పక్కాగా నిర్వహించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందేందుకు కృషిచేస్తున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ మార్గదర్శకాలకు తగ్గట్టుగా స్వచ్ఛ డివిజన్లుగా ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లోని వారంతా భాగస్వామ్యం తీసుకోవాల్సి ఉంటుంది. స్థానికులతో పాటూ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల అధికారులు, శానిటేషన్‌ సిబ్బంది భాగస్వాములుగా ఉంటారు. ఇప్పటికే కరీంనగర్‌ ఆకర్షణీయ నగరంగా గుర్తింపు పొందింది. అభివృద్ధి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు సమర్ధవంతంగా సాగితే కరీంనగర్‌ స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.  
 
 
 
స్వచ్ఛత కోసం డివిజన్ల మధ్య పోటీ
 
ఇదిలాఉంటే కరీంనగర్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలే తీసుకుంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే సందర్భంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణను ఏవిధంగా నిర్వహిస్తున్నారో అదే స్థాయీలో ప్రతిరోజు అలాగే ఉండేలా డివిజన్ల మధ్య పోటీ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం సాగుతున్న స్వచ్ఛ్ పనుల తీరుపై స్థానికులు కొంత అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. నిర్వహణ సరిగా ఉండడంలేదని విమర్శిస్తున్నారు. కార్మికులు ఏమేర పని చేశారనే విషయాలనూ పెద్దగా పరిశీలించడం లేదుని అంటున్నారు. మరోవైపు ప్రజలు కూడా తడి, పొడి చెత్త సేకరణకు రెండు రకాల డబ్బాలు ఇచ్చిన ఆ డబ్బాలు వినియోగించడం లేదని సమాచారం. ఈ డబ్బాలను దగ్గరుండీ పంపిణీ చేసిన కార్పొరేటర్లు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. మరోవైపు మురుగునీటి కాల్వలు శుభ్రం చేసిన చెత్త చెదారం వెంటనే తీసుకేళ్లకపోవడంతో ఆ చెత్తంతా అదే తిరిగి డ్రైనేజీల్లోకే చేరుతోంది. వీటన్నింటిని పరిష్కరించి ముందడుగేయాల్సి ఉంది. స్వచ్ఛ డివిజన్ల గుర్తించి పోటీ పడేందుకు ఆయా డివిజన్లకు నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 100శాతం ఇంటింటా చెత్త సేకరణ చేయడం, మురుగునీటి కాల్వలు శుభ్రంగా ఉంచడం, తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, బహిరంగమలమూత్ర విసర్జన నిర్మూలనపై తనిఖీలు చేసి ర్యాంకులు నిర్ణయిస్తారు. అంతేకాకుండా ప్లాస్టిక్‌ నిర్మూలనపై పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై ప్రత్యేక బృందం సర్వే చేపడతారు. ఇదిలాఉంటే మొదటి మూడు ర్యాంకులు సాధించిన డివిజన్లకు నగదు బహుమతులు అందిస్తారు. ప్రథమస్థానం సాధించిన డివిజన్‌కు రూ.5లక్షలు, 2, 3 స్థానాల్లోని డివిజన్లకు రూ.3లక్షలు, రూ.2లక్షల మేర ఇస్తారు. ఈ నిధులను అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులకు నగదు బహుమతులు అందించాలని భావిస్తున్నారు. అయితే స్థాయీసంఘంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయానికి రావాల్సి ఉంది.
Previous Post Next Post